Tirumala Laddu: ప్రకాష్ రాజ్ అసలు తగ్గట్లేదుగా..
ABN, Publish Date - Sep 30 , 2024 | 07:08 PM
తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదం వివాదంపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) సోషల్ మీడియాలో రోజుకో ట్వీట్ పెడుతున్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ సంచలన ట్వీట్స్ చేస్తున్నారు.
తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదం వివాదంపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) సోషల్ మీడియాలో రోజుకో ట్వీట్ పెడుతున్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ సంచలన ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది. దేశ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా? అని కోర్టు ప్రశ్నించింది. దేవుడిని రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలని హెచ్చరించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ మరోసారి రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan kalyan) ఫోటోలను షేర్ చేసి ‘దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి.. జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఒక పోస్ట్ చేశారు. ఆయన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
లడ్డూ ప్రసాదం వివాదం గురించి ఇప్పటికే పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ పలుమార్లు మాటకుమాట అనుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు (Supreme court) .. ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ పలు ప్రశ్నలు సంధించడంతో ప్రకాశ్ రాజ్ కూడా రియాక్ట్ అయ్యారు. పవన్ అభిమానులు ప్రకాష్ రాజ్‌పై సెటైర్లు వేస్తూ, దిష్టి బొమ్మ దగ్దం చేశారు. అయినా ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో వరుస పోస్ట్‌లతో విరుచుకుపడుతున్నారు ప్రకాశ్‌రాజ్.
తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌కు, ప్రకాష్ రాజ్‌కు మధ్య ఈనెల 20వ తేది నుంచి ట్వీట్ల యుద్థం జరుగుతోంది. ఉంది. ప్రకాష్ రాజ్ పోస్టులపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేయడమే కాకుండా సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దాంతో ప్రకాశ్ రాజ్ మరింత జోరు పెంచి రోజుకో ట్వీట్ వేస్తున్నారు. తమిళ హీరో కార్తి కామెంట్‌పై కూడా ప్రకాశ్ స్పందించారు. ుతప్పు చేయకుండా క్షమాపణ చెప్పించుకోవడంలో ఆనందం ఏమిటో.. జస్ట్ ఆస్కింగ్’ అంటూ వెటకారంగా స్పందించారు. అయితే ఈ ట్వీట్‌పై పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఆయన మౌనంగా ఉన్నా ఊరుకోకుండా గురువారం మరో ట్వీట్ వదిలారు ప్రకాశ్‌రాజ్. ‘గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచాక మరో అవతారం.. ఏమిటి అవాంతరం.. ఎందుకీ అయోమయం.. ఏది నిజం.. జస్ట్ ఆస్కింగ్’ అంటూ తనదైన శైలిలో ప్రశ్నించిన సంగతి తెలిసిందే!