Utsavam: ‘కళాకారుడు చనిపోవచ్చు గానీ కళ చనిపోకూడదు..’ ఎమోషనల్ రోలర్ కోస్టర్ ‘ఉత్సవం’
ABN, Publish Date - Jan 28 , 2024 | 07:39 PM
దిలీప్ ప్రకాష్ , రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, నాజర్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న తెలుగు డ్రామా 'ఉత్సవం . అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు సినిమా టీజర్‌ని విడుదల చేశారు.
దిలీప్ ప్రకాష్ (dilip prakashh), రెజీనా కసాండ్రా (Regina Cassandra) ప్రధాన పాత్రలు పోషిస్తున్న తెలుగు డ్రామా 'ఉత్సవం (Utsavam). అర్జున్ సాయి (Arjun Sai) దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్ పిక్చర్స్ (Hornbill Pictures)పై సురేష్ పాటిల్ (suresh patil) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అతిధులుగా హాజరైన ఈ టీజర్ లాంచ్ వేడుక గ్రాండ్ గా జరిగింది.
'కళాకారుడు చనిపోవచ్చుగానీ కళ చనిపోకూడదు' అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఎమోషనల్ రోలర్ కోస్టర్ అనుభూతిని ఇచ్చింది. టీజర్ లో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, నాజర్, రాజేంద్ర ప్రసాద్, ఎల్.బి. శ్రీరామ్, అలీ, ప్రేమ, ఆమని, ప్రియదర్శి లాంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో కనిపించడం కన్నులపండగలా ఉంది. యంగ్ హీరో దిలీప్ ప్రకాష్ స్క్రీన్ ప్రజెన్స్ , దిలీప్, రెజీనా కసాండ్రా పాత్రలని ప్రజెంట్ చేసిన తీరు చాలా ఆసక్తిరకంగా ఉంది. దర్శకుడు అర్జున్ సాయి ఇంతమంది వెర్సటైల్ యాక్టర్స్, వారి పాత్రల్లోని ఎమోషన్ ని టీజర్ లో అద్భుతంగా చూపించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ మనసుని హత్తుకునేలా ఉండగా, రసూల్ ఎల్లోర్ వండర్ ఫుల్ విజువల్స్ అందించారు. ప్రొడక్షన్ డిజైన్, నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో మొత్తానికి టీజర్ 'ఉత్సవంస (Utsavam) పై చాలా ఆసక్తిని పెంచింది.
హీరో దిలీప్ మాట్లాడుతూ.. కలర్ పుల్, ఎమోషనల్ జర్నీ, కంటెంట్ బేస్డ్ 'ఉత్సవం' సినిమాతో పరిచయం కావడం గర్వంగా, గౌరవంగా ఉంది. నన్ను నమ్మి ప్రోత్సహించిన నిర్మాతకు కృతజ్ఞతలు. మా సినిమాలో పని చేసిన అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులు ఆశీస్సులు, ఆదరణ మా సినిమా కావాలి'' అని కోరారు. నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ.. సినిమాకి మూలమే నాటక రంగం. ఈ టీజర్‌లోని మొదటి డైలాగే చాలా ఆకట్టుకునేలా ఉంది. ఇంతమంది లెజెండరీ నటులతో ఈ చిత్రాన్ని రూపొందించడం చాలా విశేషం. ఇంత మంచి కళాత్మక చిత్రానికి దర్శకత్వం వహించిన అర్జున్ సాయికి అభినందనలు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
దర్శకుడు అర్జున్ సాయి మాట్లాడుతూ.. గత పదేళ్ళుగా పరిశ్రమలో సహాయ దర్శకుడిగా, రచయితగా పని చేశాను. దర్శకుడిగా ఉత్సవం నా తొలి చిత్రం. టీజర్ లాంచ్ చేసిన బ్రహ్మానందం గారు, నిర్మాత ఏఎం రత్నం గారికి కృతజ్ఞతలు'' తెలిపారు.ప్రముఖ నటుడు ఎల్. బీ శ్రీరామ్ మాటాడుతూ.. నాటకానికి సంబంధించి ఎన్నో మంచి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ఉత్సవం వస్తోంది. సినిమా చాలా బావుంటుంది. నాటకం అమ్మ లాంటింది. నాటకం నుంచి పుట్టిన అనేక రూపాలే నేటి కళారూపాలు. తల్లిని గౌరవించినపుడే మనికి 'ఉత్సవం'' అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ఉత్సవం (Utsavam) హార్ట్ టచ్చింగ్ సబ్జెక్ట్. చాలా పెద్ద నటీనటులు ఇందులో వున్నారు. అర్జున్ చాలా అద్భుతంగా సినిమాని తీశారు. ఇందులో చాలా పాటలు వున్నాయి. నేను చేసిన సినిమాల్లో ఉత్సవం కూడా మంచి ఆల్బమ్స్ అవుతుందని నమ్ముతున్నాను'' అన్నారు. అనంతశ్రీరాం, లక్ష్మీ భూపాలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.