The Raja Saab: రికార్డుల బాస్‌.. ప్రభాస్! సోష‌ల్ మీడియాలో ‘రాజా సాబ్’ సునామీ

ABN, Publish Date - Jul 31 , 2024 | 09:07 AM

ఇటీవ‌ల విడుద‌లైన రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్" ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి వ్యూస్ సాధిస్తోంది.

The Raja Saab

ఇటీవ‌ల విడుద‌లైన రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) "రాజా సాబ్" (The Raja Saab) ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి వ్యూస్ సాధిస్తోంది. ఈ గ్లింప్స్ రిలీజైన 24 గంటల్లో 20 మిలియన్స్ కు పైగా వ్యూస్ దక్కించుకుంది. యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఈ గ్లింప్స్ కు వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ ప్రభాస్ క్రేజ్, స్టార్ డమ్ సత్తా ఏంటో మ‌రోమారు ప్రూవ్ చేసింది. ప్రభాస్ వింటేజ్ స్టైలిష్ రొమాంటిక్ లుక్ ప్రతి ఒక్కరినీ చాలా ఇంప్రెస్ చేస్తోంది.


ప్రభాస్ (Prabhas) ఇప్పటిదాకా ట‌చ్‌ చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో "రాజా సాబ్" సినిమా తెర‌కెక్కుతుండ‌డం విశేషం. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభాస్ ను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruth).

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (Viswa Prasad) గ్రాండ్ స్కేల్, హై టెక్నికల్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయబోతున్నారు.

Updated Date - Jul 31 , 2024 | 09:07 AM