మంత్రి సురేఖ‌ వ్యాఖ్య‌లు.. ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి ఏమ‌న్నారంటే

ABN, Publish Date - Oct 04 , 2024 | 06:56 AM

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌లు టాలీవుడ్‌లో మంట‌లు పుట్టిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ విష‌యంపై ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్ , ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స్పందించి సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

రెండు రోజుల క్రితం నాగ చైత‌న్య, స‌మంత విడాకుల గురించి అక్కినేని నాగార్జున‌కు ఆపాదిస్తూ మంత్రి కొండా సురేఖ‌ (Konda Surekha) చేసిన వ్యాఖ్య‌లు టాలీవుడ్‌లో మంట‌లు పుట్టిస్తూనే ఉన్నాయి. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలోని ప్ర‌ధాన న‌టీన‌టులంతా ఈ వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా స్పందించి మంత్రి వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. సినిమా ఇండ‌స్ట్రీని మీ సొంత రాజ‌కీయాల కోసం వాడుకోవ‌ద్దంటూ కోరారు. ఈ విష‌య‌మై నాగార్జున కొండా సురేఖ‌పై కోర్టు మెట్లు ఎక్కారు. ప‌రువు న‌ష్టం దావా కూడా వేశారు.

ఈ క్ర‌మంలో ఈ విష‌యంపై రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ (Prabhas), గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి (S. S. Rajamouli) స్పందించి సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను.. అగౌరవపరచడం ఆమోదయోగ్యం కాదని రాజకీయాలు అపాదించ‌కుండా మీ పరువు నిలుపుకోవాల‌ని ప్ర‌భాస్ (Prabhas) త‌న పోస్టులో వ్రాసుకొచ్చారు. మ‌న హద్దులను గౌరవించాలి, మీ గౌరవాన్ని కాపాడుకోండి. నిరాధార ఆరోపణలు సహించలేనివి.. ప్రత్యేకించి ప్రభుత్వంలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్య‌లు చేయటం స‌రి కాదంటూ రాజమౌళి (S. S. Rajamouli) మాట్లాడారు.


మంత్రి కొండా సురేఖ (Konda Surekha) గారు చేస్తున్న ప్రకటనలు బాధ్యతారాహిత్యమైనవి, నిరాధారమైనవి. గౌరవనీయమైన వ్యక్తుల గురించి అసభ్యకరమైన బహిరంగ వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వ పదవిని కలిగి ఉన్న ఎన్నుకోబ డిన నాయకుడి నుండి రావడం దిగ్భ్రాంతికరం. ఈ రకమైన అపవాదు మన సమాజపు మూలాధారాలను నాశనం చేస్తాయ‌ని సినీ రంగ‌మంతా కలిసికట్టుగా ఉంద‌ని మమ్మల్ని ఉద్దేశించి చేసిన ఇలాంటి నిర్లక్ష్యపు వ్యాఖ్య‌ల‌ను సహించమ‌న్నారు. మనం ప‌బ్లిక్ ఫిగ‌ర్స్ మన వ్యక్తిగత జీవితాలు ఎంతో విలువైన‌వ‌ని, గౌర‌వ మ‌ర్యాద‌లు ఉన్న‌వారిమని అంతా క‌లిసిక‌ట్టుగా ఉండాల‌ని అవ‌త‌లి వారిపై విమ‌ర్శ‌లు చేసుకోకూడ‌ద‌ని, ప్ర‌జ‌లకు ఆద‌ర్శంగా ఉండాలంటూ ఇక రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) త‌న పోస్టులో వ్రాసుకొచ్చారు.

Updated Date - Oct 04 , 2024 | 06:56 AM