మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Prabhas: కొంతగ్యాప్‌ తర్వాత ప్రేమకథతో..

ABN, Publish Date - May 04 , 2024 | 10:57 AM

గడిచిన కొన్నేళ్లల్లో ప్రభాస్‌ సరైన ప్రేమకథలో నటించలేదు. అన్ని యాక్షన్ తరహా చిత్రాలే. ఇప్పుడు ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు పెట్టనున్నారు.

గడిచిన కొన్నేళ్లల్లో ప్రభాస్‌ (Prabhas) సరైన ప్రేమకథలో నటించలేదు. అన్ని యాక్షన్ తరహా చిత్రాలే. ఇప్పుడు ప్రేమకథకి (Love story) ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం కల్కి 2898 ఎడి’ (Kalki 2898 Ad),  'సలార్‌ 2' (salaar 2), 'రాజాసాబ్‌' చిత్రాలతోపాటు కన్నప్పలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. వీటితోపాటు ఓ లవ్‌స్టోరీ చేయడానికి ఆయన గ్రీన్  సిగ్నల్‌ ఇచ్చారు. హను రాఘవపూడి (Hanu raghavapudi) దర్శకత్వంలో.. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్  పక్కాగా సిద్థమైనట్టు సినీ తెలిసింది. ప్రేమ ప్రధానంగా సాగే పీరియాడిక్‌ యాక్షన్ కథతో ఈ చిత్రం ఉండబోతున్నట్టు సమాచారం. ‘సీతారామం’ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కథానాయిక ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. మరో పక్క మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా జరుగుతున్నాయని సమాచారం. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఎ.డి’ జూన్‌ 27న విడుదల కానుంది. 

Updated Date - May 04 , 2024 | 11:03 AM