Tollywood: పిచ్చి పీక్స్‌కి వెళ్ళింది.. ప్రభాస్ అరెస్ట్ అయితే..

ABN, Publish Date - Dec 15 , 2024 | 01:05 PM

తెలుగు రాష్ట్రాల్లో కొందరు సినీ అభిమానుల పిచ్చి పరాకాష్టకు చేరింది..

కేవలం టాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్ లోను మార్వెల్ వర్సెస్ డీసీ అంటూ ఫ్యాన్ వార్స్ ఉంటాయి. ఇక బాలీవుడ్, కోలీవుడ్ ఫ్యాన్ వార్స్ సరేసరి. అయితే తాజాగా కొందరి ఫాన్స్ మాబ్ మెంటాలిటీ పీక్స్‌కి వెళ్ళింది. ఇటీవల జరిగిన అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో ఓ ప్రభాస్ ఫ్యాన్ పెట్టిన పోస్ట్ చూస్తే పిచ్చికి పరాకాష్టగా కనిపిస్తోంది. ఇంతకీ ఆ అభిమాని ఏమని పోస్ట్ చేశాడంటే..


ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అయినా నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ఆయన ఇంటికి క్యూ కట్టిన విషయం తెలిసిందే. అలాగే కొన్ని చోట్ల బన్నీ ఫ్యాన్స్ కూడా నిరసనలు, ధర్నాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సన్నివేశాలన్నీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఓ అభిమాని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. " ఒకసారి ప్రభాస్ అరెస్ట్ అయితే ఊహించుకోండి.. నైజాం మొత్తం తగలబడిపోతుందని" పోస్టు చేశాడు. అంటే ఒకప్పుడు కలెక్షన్స్, స్టోరీ, లుక్స్ గురించి కొట్లాడకున్న అభిమానులు ఇప్పుడు అరెస్టులు, తొక్కిసలాటలు రికార్డుల గురించి కూడా కొట్లాడే స్థాయికి దిగాజారిపోవడం దారుణం.


ఇలాంటి కల్చర్ తో పిల్లల తల్లితండ్రులు ఆవేదన చెందుతున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? సినిమా హీరోల? విద్యావ్యవస్థా? పేరెంటింగా? ప్రభుత్వాలదా? ఎవరిదీ తప్పు అని తేల్చుకోలేకపోతున్నారు. సినీ ఇండస్ట్రీ, ప్రభుత్వాలు ఎంత వరకు పట్టించుకుంటాయో తెలీదు కానీ తల్లితండ్రులు, టీచర్స్ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

Updated Date - Dec 15 , 2024 | 01:12 PM