Poonam Kaur: ఆ స్టార్ హీరో వేధిస్తున్నాడు.. పూనమ్ కౌర్ హాట్ కామెంట్స్
ABN, Publish Date - Nov 17 , 2024 | 02:47 PM
ఇటీవల పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పూనమ్ కౌర్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.. తాజాగా ఇప్పుడు ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఒక హీరోయిన్ని దారుణంగా వేధిస్తున్నాడని అన్నారు. దీంతో ఈ వార్తలు సినీ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఏమైందంటే..
తెలుగమ్మాయి, నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మరోసారి బాంబు పేల్చింది. గత కొంత కాలంగా తరుచూ సినీ దర్శకులు, హీరోలపై విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతూ వచ్చిన ఆమె అప్పట్లో ఓ దర్శకుడు ఎంతో మంది జీవితాలను నాశనం చేశాడంటూ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కూడా పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేసిన పూనమ్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.. తాజాగా ఇప్పుడు ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఒక హీరోయిన్ ని దారుణంగా వేధిస్తున్నాడని అన్నారు. దీంతో ఈ వార్తలు సినీ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఏమైందంటే..
ఎప్పుడు ఎదో వివాదాస్పదమైన హాట్ టాపిక్‌తో వార్తల్లో నిలిచే పూనమ్ కౌర్ ఈ సారి ఓ టాలీవుడ్ హీరోపై దారుణమైన ఆరోపణలు చేశారు. తాజాగా ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. " నేను తెలుగులో చేసిన ఒక సోషియో ఫాంటసీ చిత్రంలో నాతో పాటు ఒక అమ్మాయి నటించింది. తర్వాత ఆమె హీరోయిన్ గా కొన్ని రోల్స్ చేసింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆమె సినిమాలు చేయడం ఆపేసింది. అలాగే ఎవరికీ కనిపించకుండా పోయింది. తాజాగా నాకు ఒక డొమెస్టిక్ ఫ్లైట్‌లో కనిపించింది. ఆమె నాతో పెళ్ళికి షాపింగ్ కి వచ్చినట్లు, తాను ఈ దేశంలో ఉన్నట్లు ఎవరికీ చెప్పొదంటూ రిక్వెస్ట్ చేసింది. ఏమైందని నేను అడగగా ఆమె సమాధానమిస్తూ.. 'ఒక సూపర్ స్టార్ డమ్ కలిగిన హీరో నన్ను వేధిస్తున్నాడు.. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఫాలో అవుతున్నాడు. మేము సినిమాలో ఇంటిమెటెడ్ సీన్ చేసినప్పుడు ఆయన నా మొహంపై నిజంగానే భారీ మొత్తంలో ఉమ్మి వేశాడు. డైరెక్టర్ కట్ కూడా చెప్పలేదు' అంటూ చెప్పింది. అలాగే తర్వాత ఆమె ఇండస్ట్రీ వదిలి అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళింది. కానీ.. ఆ హీరో వేదింపులు ఇంకా తగ్గలేదని చెప్పింది. ఇదేమి కట్టు కథ కాదు. ఆ అమ్మాయిని నేను హగ్ చేసుకొని ఓదార్చాను" అంటూ రాసుకొచ్చింది.
దీంతో ఎవరు ఆ హీరో, హీరోయిన్ అంటూ ఆరా తీస్తున్నారు. ఇక ఈ పోస్ట్‌లో ఆమె పైన తమిళనాడు అని మెన్షన్ చేసి క్రింద మాత్రం తెలుగు సినిమా అని మెన్షన్ చేయడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఈ పోస్ట్ ఆమె అటెన్షన్ కోసం చేశారా వాస్తవమా అనేది తెలియాల్సి ఉంది.