Court Movie: నాని ఆ పాయింట్‌ ఎందుకు పట్టుకున్నాడంటే..

ABN, Publish Date - Oct 20 , 2024 | 10:46 AM

తాజాగా నాని బ్యానర్‌లో ‘కోర్ట్‌’ అనే ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రియదర్శి ప్రధాన పాత్రలో జగదీష్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టైటిల్‌ను బట్టి ఇదొక కోర్టు రూమ్‌ డ్రామా అని అర్థమవుతోంది.

నేచురల్‌ స్టార్‌ నాని (nani)హీరోగానే కాకుండా నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. తన అభిరుచి మేరకు కథల్ని ఎంపిక చేసుకుని సినిమాలు నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఆయన ప్రయాణం లాభాల బాటలో ఉంది. తాజాగా నాని బ్యానర్‌లో ‘కోర్ట్‌’ (Court)అనే ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రియదర్శి ప్రధాన పాత్రలో జగదీష్‌ (Jagadeesh) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టైటిల్‌ను బట్టి ఇదొక కోర్టు రూమ్‌ డ్రామా అని అర్థమవుతోంది. అయితే ఈ చిత్రంలో ఓ వివాదస్పద చట్టం గురించి చర్చిస్తున్నారని సమాచారం.

అదే.. పోక్సో యాక్ట్‌. మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలన్నీ ఈ ఫోక్సో చట్టం పరిధిలోకి వస్తాయి. ఇటీవల కొరియోగ్రాఫర్‌ జానీ అరెస్టయ్యింది కూడా ఈ కేసులోనే. ఇప్పుడు ఈ కేసు చుట్టూనే కోర్ట్‌ సినిమా తీరగబోతోందని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. జానీ మాస్టర్‌ కేసు వల్ల పోక్సో  చట్టం ఏమిటి? అందులో ఏముంది? అనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. దాన్ని సైతం ఈ కథలో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. పోక్సో  అనేది చాలా సున్నితమైన విషయం. దాన్ని డీల్‌ చేయడం అంత తేలికేౖన సంగతి కాదు. అయితే కొత్త దర్శకుడు జగదీష్‌ బలమైన స్ర్కిప్టు రాసుకొన్నాడని, ఈ కథలో క్లైమాక్స్‌ అందరినీ కదిలిస్తుందని, అది నచ్చే నాని ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చాడని తెలుస్తుంది.  ఆ కే్ౖలమాక్స్‌ నచ్చే నాని ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడని టాక్‌. 

Updated Date - Oct 20 , 2024 | 10:47 AM