Jani Master: కేసులో కొత్త పరిణామం.. కస్టడీకి జానీ మాస్టర్
ABN, Publish Date - Sep 25 , 2024 | 01:22 PM
నేషనల్ అవార్డు విన్నర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న ఆయనను నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.
నేషనల్ అవార్డు విన్నర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం రిమాంగ్లో ఉన్న ఆయనను నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇస్తూ.. రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో పోలీసులు ఈ రోజు జానీ మాస్టర్‌ను తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు.
జూనియర్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల నేపథ్యంలో సదరు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. ఆపై గోవాలో ఉన్న జానీ మాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. తాజాగా రంగారెడ్డి కోర్టు జానీ మాస్టర్‌ను కస్టడికి అనుమతించడంతో బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ (Jani Master) ను విచారించనున్నారు.