Payal Rajput: ప్రభాస్‌తో పెళ్లి వినడానికి ఎంత బావుంది!

ABN, Publish Date - Aug 05 , 2024 | 06:57 PM

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో పాయల్‌ రాజ్‌పుత్‌ (PayalS Rajput) తన హుషారైన స్టెప్పులతో సందడి చేశారు.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఫిలింఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) తన హుషారైన స్టెప్పులతో సందడి చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయని, ఈ వేడుకకు హాజరు కావడం ఇదే తొలిసారని తెలిపారు. ఆమె మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ నేను చాలా అవార్డుల కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఐఫా, సైమా వంటి ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నా. ఫిలింఫేర్‌కు (FilmFare) హాజరు కావడం ఇదే మొదటిసారి. సినిమాను సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఇదొక మంచి ప్లాట్‌ఫామ్‌. వివిధ భాషలకు చెందిన నటీనటులను ఇక్కడ కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని పాయల్‌ అన్నారు. (Marriage with Prabhas)


ఈ సందర్భంగా తనపై వచ్చిన రూమర్స్‌ గురించి పాయల్‌ చెప్పారు. ‘ప్రభాస్‌తో (Prabhas)నా పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిని చూసి బాగా నవ్వుకున్నా. ఇది నిజమైతే బాగుండు అనుకున్నా’’ అని బదులిచ్చారు. ‘‘మీ జీవితాన్ని వేరే నటి లేదా నటుడి లైఫ్‌తో ఎక్స్‌చేంజ్‌ చేసుకోవాలనుకుంటే.. ఎవరిని ఎంచుకుంటారు?’’ అని అడగ్గా.. ‘‘నాకు అలాంటి ఉద్దేశం లేదు. ప్రస్తుతం నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది. నా చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తున్నా. వాళ్లు నాపై చూపించే ప్రేమాభిమానాల వల్ల లైఫ్‌ మరింత అందంగా మారింది’’ అని సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఆర్‌ఎక్స్‌ 100’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పాయల్‌ రాజ్‌పుత్‌. తదుపరి ‘వెంకీమామ’, ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’, ‘డిస్కో రాజా’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘రక్షణ’. జూన్‌7న విడుదలైన ఈచిత్రం మిశ్రమ స్పందనకే పరిమితమైంది. ప్రస్తుతం ‘గోల్‌మాల్‌’, ‘ఏంజెల్‌’, ‘కిరాతక’ సినిమాల్లో నటిస్తున్నారు.

Updated Date - Aug 05 , 2024 | 06:58 PM