Payal Rajputh: ఇండస్ట్రీలో లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారు!
ABN, Publish Date - May 20 , 2024 | 11:46 AM
తనకు అన్యాయం చేస్తున్నారంటూ, తెలుగు ఇండసీ్ట్ర నుంచి బ్యాన చేస్తామని మూవీ మేకర్స్ బెదిరిస్తున్నారని హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
తనకు అన్యాయం చేస్తున్నారంటూ, తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని మూవీ మేకర్స్ బెదిరిస్తున్నారని హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajputh) ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. తాజాగా పాయల్ రాజ్‌పుత్ నటించిన చిత్రం 'రక్షణ’ (Rakshana) కొంత గ్యాప్ తర్వాత ఆ చిత్రం' విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు పాయల్ పోస్ట్‌లో ఏమన్నారంటే.. ‘2019-2020లో ‘రక్షణ’ సినిమా అంగీకరించా. మొదట ఆ సినిమా టైటిల్ '5WS'. ఈ సినిమా విడుదల ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రబృందం ఇప్పటివరకు నాకు మాట్లాడుకున్న రెమ్యునరేషన్ ఇవ్వలేదు. ఇటీవల కాలంలో నా సినిమాలు విజయం సాధించడంతో ఆ సక్సెస్‌ను ఉపయోగించుకోవాలని మూవీ టీమ్ భావిస్తోంది. నా పేమెంట్ ఇవ్వకుండా ప్రమోషన్లకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన మీటింగ్‌లో నేను రాలేనని నా టీమ్ చెప్పినా వినడం లేదు. నన్ను తెలుగు సినిమా నుంచి బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు. దుర్భాష లాడుతున్నారు. రెమ్యునరేషన్ చెల్లిస్తే డిజిటల్ ప్రమోషన్స్ చేస్టానని చెప్పినప్పటికీ నా మాట లెక్క చేయడం లేదు. నా ప్రతిష్ఠకు భంగం కలిగేలా నా పేరును వాడుకుంటున్నారు. ఇది సరైన పద్థతి కాదు. ఇటీవల జరిగీన కొన్ని మీటింగ్స్‌లో వాళ్లు నాపై అభ్యంతరకరంగా మాట్లాడారు. పారితోషికం విషయం తేల్చకుండా.. నా అనుమతి లేకుండా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. అందుకే నా టీమ్ ఆ చిత్రబృందంపై న్యాయపరమైన చర్చలు తీసుకునేందుకు సిద్థమైంది’ అని పాయల్ రాజ్‌పుత్ తన పోస్ట్‌లో తెలిపారు. ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.
(Payal team taking Legal action on Rakshna Producers)
ప్రదీప్ ఠాకూర్ దర్శకత్వంలో పాయల్ నటించిన ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. 2020లో షూటింగ్ పూర్తయినా, విడుదలకు నోచుకోలేదు. తాజాగా పాయల్ నటించిన 'మంగళవారం' హిట్ కావడంతో ఈ సినిమా తెరపైకి వచ్చింది. జూన్7న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్రబృందం పేర్కొంది.