మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan : హృదయపూర్వక శుభాకాంక్షలు తారక్‌!

ABN, Publish Date - May 20 , 2024 | 05:44 PM

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు (NTR)జనసేనాని పవన్  కల్యాణ్‌ (Pawan kalyan) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ మేరకు ఆయన జనసేన (janasena) కార్యాలయం నుంచి ఓ లేఖ విడుదల చేశారు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు (NTR)జనసేనాని పవన్  కల్యాణ్‌ (Pawan kalyan) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ మేరకు ఆయన జనసేన (janasena) కార్యాలయం నుంచి ఓ లేఖ విడుదల చేశారు. ‘‘ప్రముఖ కథానాయకుడు శ్రీ ఎన్టీఆర్‌ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆస్కార్‌ పురస్కారం అందుకున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌.’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సినీప్రియుల మెప్పు పొందారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న శ్రీ ఎన్టీఆర్‌ గారు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణమైన సంతోషాన్ని పొందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.’’ అని అంటూ పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. ఆయనతోపాటు మహేష్, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్  తదితరులు తారక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు. (Happy Birthday Tarak)

ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం 'దేవర' సినిమాలోని ఫియర్‌ సాంగ్‌ను విడుదల చేశారు. అలాగే ప్రశాంత్  నీల్‌తో తారక్‌ నటించబోయే సినిమా అప్‌డేట్‌ కూడా ఇచ్చారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లబోతోంది అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం తారక్‌ నటిస్తున్న దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. మొదటి భాగాన్ని అక్టోడర్‌ 14న విడుదల చేయనున్నారు. 

Updated Date - May 20 , 2024 | 05:45 PM