Hari Hara Veera Mallu పవన్ సెట్లో అడుగుపెట్టేది అప్పుడే
ABN, Publish Date - Sep 14 , 2024 | 12:08 PM
పవన్ తదుపరి చిత్రాన్ని తెరపై చూసేందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులు.
పవన్ (Pawan Kalyan) తదుపరి చిత్రాన్ని తెరపై చూసేందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులు. ప్రస్తుతం ఆయన 'హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu), ఓజీ’, ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలకు పవన్‌కల్యాణ్ 20 రోజుల చొప్పున షూటింగ్ చేస్తే చిత్రీకరణ పూర్తయిపోతుందని ఇప్పటికే ఆయా చిత్రాల మేకర్స్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం పవన్‌కల్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రానికి డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఆగస్ట్‌లోనే పవన్ సెట్లో అడుగుపెట్టాల్సి ఉంది. రాజకీయ పనుల్లో బిజీగా కావడం, మరో పక్క వరదల కారణంతో ఆయన షూటింగ్‌కు తాత్కాలికంగా ఆపారని తెలుస్తుంది. హరిహర వీరమల్లు కోసం పవన్ కల్యాణ్ ఇంకా 20 రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. అది జరిగితే సినిమా మొత్తం పూర్తయినట్లే. తదుపరి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించి విడుదల చేసే సన్నాహాల్లో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. పవన్ చేయాల్సింది అంతా ఇండోర్ షూట్ మాత్రమే. అందు కోసం విజయవాడలో సెట్ వర్క్ జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ నెలఖరు లేదా అక్టోబర్ మొదటివారంలో పవన్‌కల్యాణ్ షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. రిపబ్లిక్ డే రోజులు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. అయితే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌కు తక్కువ సమయం ఉండడంతో ఏప్రిల్‌లో విడుదల ఉండొచ్చని కూడా టాక్ నడుస్తోంది. పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. తొలుత ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడిగా పని చేశారు. పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లగా ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలను ఎ.ఎం జ్యోతి కృష్ణ తీసుకున్నారు. క్రిష్ 50శాతానికి పైగా సినిమాను పూర్తి చేశారు. మిగతా భాగాన్ని జ్యోతికృష్ణ హ్యాండిల్ చేయనున్నారు. ఇందులో అనుపమ్ ఖేర్, బాబీ దేవోల్, విక్రమ్‌సింగ్ విర్క్, నోర ఫతేహి, నర్గీస్ ఫక్రీ, సచిన్ ఖేడ్కర్, జిషుసేన్ గుప్తా. దాలిప్ తాహిల్ కీలక పాత్రధారులు. ఎ.దయాకరరావు, ఏ.ఎం రత్నం భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక సుజిత్ దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ' (OG)విషయానికొస్తే... ఈ చిత్రానికి 20 నుంచి 25 రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. అయితే అదంతా అవుట్ షూటింగ్. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉన్న బిజీ షెడ్యూల్లో అవుడ్ డోర్ షూటింగ్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందనేది తెలియాల్ని ఉంది. అయితే 'హరిహర వీరమల్లు' షూటింగ్ పూర్తి కాగానే ఓజీ సెట్లో పాల్గొంటానని పవన్ ఇప్పటికే మాటిచ్చారని మేకర్స్ చెప్పారు. ఆ తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందని తెలుస్తోంది.