Pawan Kalyan: కుదిరితే మద్దతు ఇవ్వండి.. అంతే కానీ అపహాస్యం చేయొద్దు
ABN, Publish Date - Sep 24 , 2024 | 11:30 AM
ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు. తిరుమల శ్రీవారి (Tirumala Laddu) లడ్డూ వివాదంపై కుదిరితే మద్దతుగా మాట్లాడండి కానీ అపహాస్యం చేయొద్దన్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) చిన్నపాటి వార్నింగ్ ఇచ్చారు. తిరుమల శ్రీవారి (Tirumala Laddu) లడ్డూ వివాదంపై కుదిరితే మద్దతుగా మాట్లాడండి కానీ అపహాస్యం చేయొద్దన్నారు. అలా చేస్తే ప్రజలు క్షమించరు అని ఆయన అన్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడారు.
"చిత్ర పరిశ్రమకు కూడా చెబుతున్నా. హిందూ ధర్మాన్ని రక్షించాలంటే మద్దతుగా నిలవండి. కానీ మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే ప్రజలు క్షమించరు. తిరుపతి లడ్డూ అనేది బాధతో కూడిన అంశం. దీనిపై జోక్‌లు వేస్తున్నారు. నిన్న రాత్రి ఓ సినిమా ఫంక్షన్‌లో చూశాను. సదరు హీరో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ.. నన్ను ఇందులోకి లాగొద్దు అన్నారు. దయచేసి అలా మాట్లాడొద్దు. నటుడిగా మిమ్మల్ని నేను గౌరవిస్తాను. సనాతన ధర్మం విషయంలో ఆ మాట అనాలంటే వందసార్లు ఆలోచించాలి’’ అని పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) మండిపడ్డారు.
అసలేం జరిగిందంటే.. తమిళ హీరో కార్తి నటించిన 'సత్యం సుందరం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో కొన్ని మీమ్స్‌ను స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసి కామెంట్ చెప్పమని యాంకర్ మంజూష కోరారు. ఒక మీమ్‌లో 'లడ్డూ కావాలా నాయనా’ అని వచ్చింది. దాన్ని చూసిన కార్తీ 'ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ విషయమిది. ఇప్పుడు మనకొద్దు అది’ అంటూ టాపిక్ డైవర్ట్ చేశారు. దీనిపై పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. దయచేసి అలా మాట్లాడొద్దని కార్తికి హితవు పలికారు.దీనితో కార్తితోపాటు యాంకర్ మంజూషను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
అంతే కాదు గతంలో అయ్యప్పస్వామి దీక్షపై పలువురు చేసిన కామెంట్ల గురించి పవన్ మాట్లాడారు. అయ్యప్పస్వామి దీక్ష చేసేవారిపై ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇవే మాటలు ఇస్లాం మతస్తుల ముందు మాట్లాడగలరా? వారు రోడ్డు మీదకి లాగి కొడతాడరని భయంతో ఇతర మతస్తుల గురించి మాట్లాడలేరు. హిందువులంటే మెత్తని మనుషులని చులకన. అందుకే హిందూ ధరాన్ని, హిందువులను చులకన చేసి మాట్లాడతారు. నమ్మకాలు లేనివారు ఇంట్లో కూర్చొండి. మమ్మల్ని ఏమీ అనకండి. హిందువుల పూజా విధానం ఎలా ఉంటుందో తెలుసుకోండి’’ అని మండిపడ్డారు.