Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. కోటి విరాళం
ABN, Publish Date - Sep 03 , 2024 | 08:27 PM
తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల తీవ్ర నష్టం సంభవించిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుండి సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలు విరాళాలు ప్రకటించారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపీ సీఏం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళాన్ని ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల తీవ్ర నష్టం సంభవించిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుండి సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా విరాళాలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరద బాధిత ప్రాంతాలలోని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఈ వరదల వల్ల నష్టం భారీగానే జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో అండగా ఉండాలని అందరికీ వారు పిలుపునిస్తున్నారు. ముఖ్యమంత్రుల పిలుపుతో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తుండటం అభినందనీయం. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. ఏపీ సీఎం సహాయనిధికి రూ. కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు.
Also Read-Tollywood: తెలుగు రాష్ట్రాలకు అండగా చిత్ర పరిశ్రమ.. ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అయినప్పటికీ తన బర్త్‌డే వేడుకలను జరపవద్దని అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ వేడుకలకు అయ్యే ఖర్చును వరద బాధితులను ఆదుకునేందుకు ఖర్చు చేయాల్సిందిగా కోరారు. ఆయన పిలుపుతో.. ఎక్కడికక్కడ జనసైనికులు, అభిమానులు సహాయక చర్యల్లో పాల్గొని.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా పబ్లిక్‌లోకి రానప్పటికీ.. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారని అధికారిక ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఏపీ సీఏం రిలీఫ్ ఫండ్‌కు రూ. కోటి ప్రకటించి వార్తలలో నిలిచారు. ప్రస్తుతం రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని పరిశీలన చేస్తున్నారని, రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆయన.. తాను డైరెక్ట్‌గా పాల్గొంటే సహాయక చర్యలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని అధికారులు చెప్పడం వల్లే.. బయటికి రాలేదని, కానీ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూనే ఉన్నానని తెలిపారు.
Also Read- Balakrishna: తెలుగు రాష్ట్రాలకు బాలయ్య బాబు భారీ విరాళం
ఇప్పటి వరకు సహాయం ప్రకటించిన సెలబ్రిటీలు వీరే..
పవన్ కళ్యాణ్- ఏపీకి రూ. కోటి
నందమూరి బాలకృష్ణ- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు
వైజయంతీ మూవీస్- ఏపీకి రూ. 25 లక్షలు
త్రివిక్రమ్ - రాధాకృష్ణ - నాగవంశీ: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు
ఆయ్ మూవీ నిర్మాత బన్నీ వాస్: ‘ఆయ్’ ఈ వారం కలెక్షన్స్‌లో 25 శాతం ఏపీకి
విశ్వక్సేన్- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
సిద్ధు జొన్నలగడ్డ- ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు
వెంకీ అట్లూరి- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు
అనన్య నాగళ్ల- ఏపీకి రూ. 2.5 లక్షలు, తెలంగాణకు రూ. 2.5 లక్షలు
Read Latest Cinema News