Music Directors: టాలీవుడ్‌లో తమిళ కంపోజర్‌ల హవా..

ABN, Publish Date - Oct 17 , 2024 | 10:37 PM

టాలీవుడ్‌లో తమిళ కంపోజర్‌ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలు మొదలుకొని, మిడిల్ రేంజ్ మరియు చిన్న సినిమాల వరకు ఇతర భాషల సంగీత దర్శకులతో వర్క్ చేయించుకునేందుకే దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇతర భాషలకు చెందిన ఏయే సంగీత దర్శకుల హవా నడుస్తుందంటే..

DSP and Thaman

టాలీవుడ్‌లో తమిళ కంపోజర్‌ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలు మొదలుకొని, మిడిల్ రేంజ్ మరియు చిన్న సినిమాల వరకు ఇతర భాషల సంగీత దర్శకులతో వర్క్ చేయించుకునేందుకే దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరీ ముఖ్యంగా తమిళ సంగీత దర్శకుల హవా టాలీవుడ్‌లో బాగా నడుస్తోంది. ఇంతకు ముందు ఒకటి రెండు చిత్రాలకే పరిమితమైన వారి హవా.. ఇప్పుడు దాదాపు వారిదే పై చేయి అన్నట్లుగా మారిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Allu Arjun: యూపీ నుంచి సైకిల్‌పై.. ఫ్యాన్స్ ఎమోషనో.. పర్సనల్ ప్రమోషనో..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న చిత్రానికి ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. తమిళంలో అగ్ర సంగీత దర్శకుడిగా చలామణీలో ఉన్న అనిరుధ్ రవిచందర్‌ వరుసగా తెలుగు సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. ఇటీవలే అతను వర్క్ చేసిన ‘దేవర’ సినిమా రిలీజ్ కాగా.. రాబోతున్న సినిమాల్లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రానికి సంగీతం అందించడానికి అనిరుధ్ ఒకే చెప్పాడు. అలాగే గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న కాన్సెప్ట్ మూవీ ‘మ్యాజిక్’కు కూడా అనిరుధ్ రవిచందరే సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కబోతోన్న రెండో సినిమాకు కూడా అనిరుధ్ పేరును అధికారికంగా ప్రకటించారు.


ఇక ఎ.ఆర్ రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాష్ కుమార్ కూడా ఈమధ్య తెలుగులో సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. వరుణ్ తేజ్ ‘మట్కా’, దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ వంటి సినిమాలు జీవి చేతిలో ఉన్నాయి. వీరే కాక సంతోష్ నారాయణన్, జిబ్రాన్, యువన్ శంకర్ రాజా వంటి కంపోజర్స్ తెలుగు సినిమాలకు వర్క్ చేస్తున్నారు. మళయాళ కంపోజర్ జేక్స్ బిజోయ్ కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇతర ఇండస్ట్రీలకు చెందిన సంగీత దర్శకులు టాలీవుడ్‌లో పనిచేయడంపై మీ స్పందన ఏమిటని ఇటీవల రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ని అడుగగా.. ‘పరభాషా సంగీత దర్శకులు తెలుగు సినిమాలకు వర్క్ చేయటంలో ఎలాంటి ఇబ్బంది లేదు. మంచిదే.. సంగీతం విస్తరిస్తుంది. కొత్త కొత్త మ్యూజిక్ ప్రేక్షకులకు చేరుతుంది. కాకపోతే చేసే పనిని అవగాహనతో చేయాల్సిన అవసరం ఉంది’ అని లైట్‌గా చిన్న చురక అంటించారు. ఇక తెలుగువారైన కీరవాణి, తమన్, దేవిశ్రీ ప్రసాద్ మినహా.. ఎక్కువ సినిమాలకు పరభాషా సంగీత దర్శకులను మేకర్స్ ఎంపిక చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఆడియన్స్ సైతం పర్టిక్యులర్ సంగీత దర్శకుడి పేరును ఎక్కువగా డిమాండ్ చేయటంతో వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి మేకర్స్ తీసుకుంటున్నారు.

Also Read- Salman Khan: సల్మాన్ ఇంటి దగ్గర ఫైర్.. బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ అరెస్ట్

Also Read- Ram Charan: నిండైన మనసుతో పాపకు ప్రాణం పోశాడు


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 17 , 2024 | 10:37 PM