RGV: రామ్‌గోపాల్ వర్మ ఇంటికి పోలీసులు..
ABN, Publish Date - Nov 25 , 2024 | 11:07 AM
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ అరెస్ట్‌కు రంగం సిద్థమైంది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి ఒంగోలు పోలీసులు వెళ్లారు.
టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ (Ram Gopal Varma) అరెస్ట్‌కు రంగం సిద్థమైంది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి ఒంగోలు పోలీసులు (Ongole police) వెళ్లారు. సోమవారం రూరల్ పీఎస్‌లో విచారణకు ఆర్జీవీ హాజరు కావాల్సి ఉంది. మరోసారి ఆయన విచారణకు డుమ్మా కొట్టారు. సోమవారం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈరోజు వర్మ కేసు (RGV Case) విచారణకు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ వర్మకి నోటీసు ఇచ్చారు. ఈనెల 19న విచారణకు హాజరు కాకుండా వారం రోజులు గడువు కోరిన సంగతి తెలిసిందే! వర్మ విజ్ఞప్తి మేరకు వారం రోజులు గడువు ఇచ్చారు. ఈరోజు కూడా విచారణకి హాజరుకావడం లేదని తన లాయర్ శ్రీనివాస్‌కి సమాచారం ఇచ్చారు వర్మ. దాంతో అరెస్ట్ చేేసందుకు పోలీసులు సిద్థమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేసులో రామ్‌గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్నారు.
గత ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాలలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. క్వాష్ పిటిషన్‌లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. పోలీసుల ముందు హాజరయ్యేందుకు మరికొంత సమయం ఇవ్వాలన్న రామ్‌గోపాల్ వర్మ తరఫు న్యాయవాది అభ్యర్థననూ తోసిపుచ్చింది. ఈ తరహా అభ్యర్థనను సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) వద్ద చేసుకోవాలని, కోర్టు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని పేర్కొంది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ముత్తనపల్లి రామలింగయ్యకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో రాంగోపాల్ వర్మ విచారణకు హాజరు కావడం అనివార్యమైంది.