Sankranthi: రామ్ చరణ్, బాలయ్యలకు పోటీగా సంక్రాంతి బరిలోకి మరో స్టార్ హీరో చిత్రం..
ABN, Publish Date - Nov 29 , 2024 | 04:13 PM
ఇప్పటికే రెండు భారీ బడ్జెట్ సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలయ్య ‘డాకు మహారాజ్’ సినిమాలు సంక్రాంతికి డేట్ ఫిక్స్ చేసుకుని ఉన్నాయి. వీరితో పాటు వచ్చేందుకు విక్టరీ వెంకీ కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ కర్చీఫ్ వేసేశారు. ఇలా ఉన్న సంక్రాంతి రేస్‌లోకి మరో స్టార్ హీరో దూసుకొచ్చారు.. ఆ వివరాల్లోకి వెళితే..
సంక్రాంతికి నాలుగు సినిమాలను భరించే కెపాసిటీ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉన్నట్లుగా నిర్మాతలు చెబుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి బరిలో నాలుగు నుండి 5 వరకు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈసారి సంక్రాంతికి వచ్చే సినిమాల లిస్ట్ రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సంక్రాంతి బరికి సిద్ధమవుతుండగా, మరోవైపు ‘డాకు మహారాజ్’గా బాలయ్య డేట్ ఫిక్స్ చేసుకున్నారు. వీరిద్దరూ కాకుండా విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా ఇదే అనేలా టైటిల్‌తోనే కర్చీఫ్ వేసుకున్నారు. ఇప్పుడీ సినిమాలతో పాటు మరో స్టార్ హీరో సినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఆ స్టార్ హీరో ఎవరు? ఏమా సినిమా అనే విషయానికి వస్తే..
Also Read- Chai Sobhita: డోల్ డోల్ డోల్ భాజే.. అక్కినేని ఇంట్లో సంబరాలే
కోలీవుడ్ స్టార్ అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్నట్లుగా తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. రీసెంట్‌గానే షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. తాజాగా ‘విడాముయర్చి’ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ టీజర్‌ను గమనిస్తే.. ఇందులో హీరో అజిత్ కుమార్ డిఫరెంట్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ప్రపంచమంతా నిన్ను నమ్మకపోయినా పరవాలేదు.. నిన్ను నువ్వు నమ్ముకో.. అనే కాన్సెప్ట్‌తో యాక్షన్ బేస్డ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కినట్లుగా ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. అజిత్ దేని కోసమో అన్వేషిస్తూ.. అడ్డువచ్చిన విలన్స్ భరతం పడుతూ.. తాను సాధించాల్సిన లక్ష్యం కోసం ఏం చేయటానికైనా, ఎంత దూరం వెళ్లటానికైనా, ఎవరినైనా ఎదిరించేలా ఇప్పటి వరకు కనిపించని ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు. టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి. సంక్రాంతికి మెప్పించే కంటెంట్ ఇందులో ఉందనేది ఈ టీజర్ ఓ క్లారిటీ ఇచ్చేస్తుంది. కోలీవుడ్ మ్యూజికల్ రాక్ స్టార్ అనిరుద్ సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలెట్ అయ్యేలా అనిపిస్తోంది. ఓవరాల్‌గా అయితే.. సంక్రాంతికి మంచి పోటీ ఇచ్చే సినిమాగానే ‘విడాముయర్చి’ ఉండబోతుందనేది ఈ టీజర్‌తో స్పష్టమవుతోంది. మరి ఈ సినిమాలకు థియేటర్లు ఎలా అడ్జస్ట్ అవుతాయనేది చూడాల్సి ఉంది.