Bhumika: 'ఒక్కడు' కాంబో రిపీట్?

ABN, Publish Date - Oct 07 , 2024 | 12:07 PM

తెలుగు సినిమా విశ్లేషణ వచ్చిన ప్రతిసారి తెరమీదకి వచ్చే సినిమా పేరు 'ఒక్కడు' ఎప్పుడు ఎదో చర్చల్లో నిలుస్తుంది. తాజాగా ఓ సన్నివేశం చూస్తే ఈ సినిమా కాంబో మళ్ళీ రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సన్నివేశం ఏంటంటే..

okkadu poster

'ఒక్కడు' (Okkadu) గుణశేఖర్ (Guna Sekhar) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్యాన్స్‌తో పాటు ఈ సినిమాలో పని చేసిన ఆర్టిస్ట్స్ అందరికి ఎంతో ప్రత్యేకం. మహేష్ బాబు‌ని స్టార్‌గా చేసిన ఈ సినిమా.. హీరోయిన్ భూమిక (Bhumika), దర్శకుడు గుణశేఖర్‌లను కూడా స్టార్‌లుగా మలిచింది. తెలుగు సినిమా విశ్లేషణ వచ్చిన ప్రతిసారి తెరమీదకి వచ్చే ఈ సినిమా ఎప్పుడు ఎదో చర్చల్లో నిలుస్తుంది. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ 'మణిశర్మ' అందించిన మ్యూజిక్ మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పక్కనపెడితే ఈ మూవీ కాంబో రిపీట్ కావాలని కోరుకునే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. తాజాగా ఓ సన్నివేశం చూస్తే ఈ కాంబో రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ సన్నివేశం ఏంటంటే..


'శాకుంతలం' ఫ్లాప్ తర్వాత దర్శకుడు గుణశేఖర్ కాస్త గ్యాప్ ఇచ్చి మరో సినిమా మొదలుపెట్టాడు. తన భార్య 'నీలిమ గుణ' నిర్మాణంలో 'యుఫోరియా' (Euphoria) అనే యూత్ ఫుల్ సోషల్ డ్రామాని తెరెకెక్కిస్తున్నాడు. అయితే ఈరోజు సాయంత్రం ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. ఈ క్రమంలో టీజర్ అప్డేట్‌ని హీరోయిన్ భూమిక తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు. మరోవైపు ఈ సినిమా యూనిట్ కాస్టింగ్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో భూమిక ఈ మూవీలో కీలక పాత్రలో నటించనుంది అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. వాస్తవానికి 'ఒక్కడు' తర్వాత ఆ రేంజ్ సక్సెస్‌ని తిరిగి చూడని డైరెక్టర్ గుణశేఖర్‌కి ఈ సినిమా ద్వారా అదృష్టం తిరిగొస్తుందా అనేది వేచిచూడాల్సింది.


అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి నటించిన మూవీ 'బటర్‌ఫ్లై'లో ఆమె చివరిగా తెలుగులో నటించారు. ప్రస్తుతం ఆమె కంగనా రనౌత్ తో కలిసి నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటున్న భూమిక తాజాగా వ్యాపారరంగంలోకి అడుగుపెట్టింది. 'సమర వెల్‌నెస్‌' (Samara Wellness) పేరుతో గోవాలో ఓ హోటల్‌ ప్రారంభించారు.

Updated Date - Oct 07 , 2024 | 12:07 PM