NTR: నటసార్వభౌముడికి ఘన నివాళి..

ABN, Publish Date - Dec 20 , 2024 | 11:07 AM

నటసార్వభౌముడికి ఘన నివాళ్లు అందించేందుకు మొదలుపెట్టిన శ్రీకారానికి మద్దతు లభించింది.

తెలుగు జాతికి గర్వకారణం నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకి ఘన నివాళ్లు అర్పించేందుకు శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీకి తెలంగాణ ప్రభుత్వం మద్దతు తెలిపింది.


ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి మోహనకృష్ణ, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ సభ్యులు మధుసూదన రాజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిశారు. గత ఏడాదిన్నర కాలంగా ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అలాగే హైదరాబాద్ లో 100 అడుగుల ఎత్తుతో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని నెలకొల్పాలన్న సంకల్పాన్ని వివరించి, దానితోపాటు ఎన్టీఆర్ నాలెడ్జి సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనుకొంటున్నామని, ఇందుకుగాను తెలంగాణ ప్రభుత్వం తరఫున స్థలాన్ని కేటాయించి సహకరించాలని కోరారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో విగ్రహం ఏర్పాటుకు అనుమతినిచ్చారు.


దీంతో ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

Updated Date - Dec 20 , 2024 | 12:29 PM