మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jr NTR: ఎన్టీఆర్‌- ప్రశాంత్ నీల్ లేటెస్ట్‌ అప్‌డేట్‌!

ABN, Publish Date - May 02 , 2024 | 09:59 AM

‘కేజీఎఫ్‌’, ‘సలార్‌’ సినిమాలతో పాన్  ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. అంతే కాదు 'కేజీఎఫ్‌' చిత్రంతో రెండు జాతీయ పురస్కారాలను కూడా అందుకున్నారు.

‘కేజీఎఫ్‌’(KGF), ‘సలార్‌’ (Salaar) సినిమాలతో పాన్  ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth neel). అంతే కాదు 'కేజీఎఫ్‌' చిత్రంతో రెండు జాతీయ పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 'సలార్‌-2’తో బిజీగా ఉన్నారు. తదుపరి ఎన్టీఆర్‌తో (Jr NTR) ఓ చిత్రం ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రకటించి చాలా కాలమైంది. ఇప్పటిదాకా కొత్త అప్‌డేట్‌ ఏమీ లేదు. ప్రారంభ సమయంలో ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాలి. కానీ తారక్‌ ‘వార్‌ 2’(War -2)తో.. ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌ 2’ బిజీగా ఉండటంతో ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాదిలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించుకోనున్నట్లు తెలిసింది. అక్టోబరు నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు పెట్టడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందని సన్నిహితులు నుంచి సమాచారం. (Ntr and Prashanth Neel Movie update)

అప్పటికి ఎన్టీఆర్‌ ‘వార్‌ 2’ని షూటింగ్‌ పూర్తి చేస్తారని టాక్‌. అలాగే 'దేవర’ చిత్రం కూడా శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. సైఫ్‌ అలీఖాన్  కోలుకుని సెట్‌లో అడుగుపెడితే ఆ చిత్రం కూడా త్వరలోనే పూర్తవుతుంది. ఆ తర్వాత ప్రశాంత నీల్‌ తన చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్తారు.  

Updated Date - May 02 , 2024 | 10:44 AM