Nivetha Pethuraj: నేను ముందే ఊహించా.. నా బాయ్‌ఫ్రెండ్ చీట్ చేశాడు
ABN, Publish Date - Jul 03 , 2024 | 01:56 PM
తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేని నటి నివేథా పేతురాజ. తాజాగా ఓ ఛానల్ తో ఆమె మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్‌లో సంఘటనల గురించి తెలిపింది.
తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేని నటి నివేథా పేతురాజ్ (Nivetha Pethuraj). 2017లో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన మెంటల్ మది సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోయింది. ఆ క్రమంలోనే త్రిదిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురంలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. దీంతో ఈ సినిమా తర్వాత కెరీర్ పరుగులు పెడుతందని ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఈ చిన్నదాని అడియాశలే అయ్యాయి.
దీంతో ఇటీవల వెబ్ సిరీస్‌లలో కూడా అడుగు పెట్టిన ఈ భామ లేటెస్ట్‌గా పరువు అనే సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నడి రోడ్డుపై కారుతో చేసిన రచ్చతో ఒక్కసారిగా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇటీవల ఓ పర్మిట్ రూమ్ అనే యూట్యూబ్ ఛానల్‌లో అన్ ఫిల్టర్ అనే కార్యక్రమంలో నివేథా (Nivetha Pethuraj) మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన రెండు మూడు ఘటనల గురించి తెలిపింది.
నాకు మ్యానిఫెస్టేషన్ (manifestation) లాంటి ఓ ఫోభియా ఉందని దాంతో నేను ఆలోచించే విషయాలు కొన్ని సార్లు నిజం అవుతున్నాయని చెప్పుకొచ్చింది. చిన్నతనంలో తాతతో కలిసి బ్యాక్‌యార్డ్‌లో వెతుకుతుంటే ఎమౌంట్ దొరుకుతుందని అనుకునే దానిని సరిగ్గా నాకు అలానే జరిగేదని డబ్బులు దొరికేవని తెలిపింది. గతంలో ఓ సారి నా బాయ్‌ఫ్రెండ్ నన్నుమోసం చేసినట్లుగా ఊహించుకున్నానని, కొద్ది రోజుల తర్వాత నిజంగానే నన్ను వదిలేసి మరొకరితో వెళ్లినట్లు నివేథా పేతురాజ్ (Nivetha Pethuraj) తెలిపింది.
అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న, జరగబోయే చాలా అంశాలు నేను ఎప్పుడో ఒక్కసారి నేను ఊహించిన వాటి నుంచే జరుగుతున్నాయంటూ చెప్పుకొచ్చింది. నేను ఇప్పుడు వాడుతున్న కార్ల అంశంలోనూ ఇది జరిగిందన్నారు. ఇక నాకు మెకనోఫిలియా ఉందని అందుకే మోటార్ స్పోర్ట్స్ నన్ను బాగా ఎట్రాక్ట్ చేస్తాయని పేర్కొంది. తీరిక సమయాల్లో రేసింగ్ చేస్తానని నివేథా పేతురాజ్ (Nivetha Pethuraj) తెలిపింది.