Robinhood: ఆ స్టార్ హీరోకి కష్టాలు తెచ్చిన బన్నీ

ABN, Publish Date - Nov 25 , 2024 | 07:58 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కారణంగా ఓ స్టార్ హీరో సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుంది. ఇంతకీ ఏమైందంటే..

హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఫిల్మ్ ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమాని దాదాపు రూ. 70 కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప 2, గేమ్ ఛేంజర్ వంటి భారీ సినిమాల రిలీజ్ మధ్యలో విడుదలవుతున్న ఈ సినిమాకి హ్యుజ్ కాంపిటేషన్ ఉంది. అయితే ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్ పెద్ద ప్రభావం చూపించలేకపోయింది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ తో హైప్ పెంచుదాం అనుకున్న మేకర్స్ కి అల్లు అర్జున్ తో కష్టాలు తప్పడం లేదు. ఇంతకీ ఏమైందంటే..


డిసెంబర్ 20కి రిలీక్ కావాల్సిన ‘రాబిన్‌హుడ్’ డిసెంబర్ 25కి షిఫ్ట్ అయ్యింది. రిలీజ్ కి రెండు వారాల ముందు 'పుష్ప 2' రిలీజ్, రిలీజ్ రెండు వారాల తర్వాత 'గేమ్ ఛేంజర్' సినిమాల రిలీజ్ ఉండటంతో సినిమాకి కష్టాలు తప్పేలా లేవు. అయితే 'పుష్ప 2' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మైత్రీ సంస్థ డిసెంబర్ 7 వరకు ఫ్రీ అయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు ఏకంగా 6 సినిమాలు క్రిస్మస్ బరిలో ఉండటంతో నితిన్ సినిమాకి కష్టాలు తప్పేలా లేవు. అందుకే నిర్మాత దిల్ రాజు తను నితిన్ తో నిర్మించిన తమ్ముడు సినిమాను వెనక్కు పెట్టారని సమాచారం.


ఇక టీజర్ విషయానికి వస్తే.. ఓ పవర్ ఫుల్ వాయిస్‌ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. నితిన్ హై-ఫై ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, అడ్వంచరస్ దోపిడీలను చేసే మోడరన్ రాబిన్‌హుడ్‌గా పరిచయం అయ్యారు. అతనికి ప్రత్యేకమైన ఎజెండా లేదా నిర్దిష్ట కారణం ఏమీ లేదు, అతని ఏకైక మోటివేషన్ డబ్బు. ఇలాంటి సిట్యువేషన్స్‌లో అతను పవర్ ఫుల్ కుటుంబ నేపథ్యం శ్రీలీలని ఇష్టపడతాడు. ఇది ఇప్పటికే డేంజర్‌లో వున్న అతని లైఫ్ ని మరింత కాంప్లికేట్ చేస్తుంది. వెంకీ కుడుముల ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌లో నెరేటివ్‌లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఈసారి, టీజర్ నితిన్ పాత్రపై మరింత ఇన్ సైట్‌ని అందిస్తూ, మూవీ ప్రిమైజ్‌ని గ్లింప్స్‌గా అందిస్తుంది.

Updated Date - Nov 25 , 2024 | 07:58 PM