Pawan Kalyan: వరద బాధితులకు నిహారిక సాయం.. పవన్‌ ప్రశంసలు

ABN, Publish Date - Sep 09 , 2024 | 04:00 PM

విపత్కర పరిస్థితుల్లో నిరాశ్రయులైన ప్రజలకు అండగా ఉండటంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఆపదలో ఉన్న వారిని అండగా నిలుస్తుంటారు.


విపత్కర పరిస్థితుల్లో నిరాశ్రయులైన ప్రజలకు అండగా ఉండటంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఆపదలో ఉన్న వారిని అండగా నిలుస్తుంటారు. ఇటీవల ముంచుకొచ్చిన వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే! వరదల కారణంగా నిరాశ్రయులై వేలమంది ఇబ్బందులు పడ్డారు. బాధితుల సహాయార్థం ప్రభుత్వం పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు భారీగా విరాళాలు ఇచ్చారు. తాజాగా నాగబాబు కుమార్తె నిహారిక (Niharika konidela) కూడా తన వంతు సాయం చేశారు. పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తితో బుడమేరు ముంపునకు గురైన పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి దానికి రూ. 50 వేలు చొప్పున రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. తాజాగా ఈ విషయంపై నిహారికను అభినందిస్తూ పవన్‌ పోస్ట్‌ పెట్టారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఒక్కో గ్రామానికి రూ.50వేలు చొప్పున రూ.5 లక్షల విరాళమిచ్చిన నిహారికకు అభినందనలు తెలుపుతున్నా. కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉండాలనే మంచి సంకల్పంతో సాయం చేసేందుకు ముందుకు రావడం సంతోషాన్నిచ్చింది. ఇటీవల పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ‘కమిటీ కుర్రోళ్లు’తో నిర్మాతగా విజయం సాధించిన నిహారిక భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఆ పోస్ట్‌లో (Pawan kalyan) పేర్కొన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 04:00 PM