The Constable: ది కానిస్టేబుల్‌లో.. వరుణ్ సందేశ్ నట విశ్వరూపం చూస్తారు

ABN, Publish Date - Jun 20 , 2024 | 08:31 PM

వరుణ్ సందేశ్ హీరోగా, మధులిక వారణాసి హీరోయిన్‌గా రూపొందిన చిత్రం ది కానిస్టేబుల్. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈసంద‌ర్భంగా మేక‌ర్స్ సినిమా విడుద‌ల గురించి ముఖ్య విష‌యాల‌ను పంచుకున్నారు.

varun sandesh

వరుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా ఆర్యన్ సుభాన్ SK దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న చిత్రం ది కానిస్టేబుల్ (The Constable). వరుణ్ సందేశ్ కి జోడిగా మధులిక వారణాసి (Madhulika Varanasi) హీరోయిన్ గా తొలిపరిచయం కానున్నారు. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ (Varun Sandesh) మాట్లాడుతూ.. "సినిమా షూటింగ్ అంతా చాలా హాయిగా సాగింది. త్వరలో కానిస్టేబుల్ పాత్రలో కొత్తకోణంలో, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను" అని చెప్పారు.

నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ.. కథ, కథ‌నాలు అద్భుతంగా అమరిన చిత్రమిదని. పోలీస్ పాత్రలో వరుణ్ సందేశ్ ఆకట్టుకుంటారన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ.. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో వరుణ్ సందేశ్ నట విశ్వరూపం చూడవచ్చన్నారు. త్వరలోనే ఈ చిత్రంలోని పాటలను, మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తామని అన్నారు.


ఇంకా దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా; హజరత్ షేక్ (వలి), సంగీతం :సుభాష్ ఆనంద్, ఎడిటింగ్: వర ప్రసాద్, B. G. M :గ్యాని, ఆర్ట్: వి. నాని, పండు, మాటలు :శ్రీనివాస్ తేజ, పాటలు: రామారావు, శ్రీనివాస్ తేజ, సహనిర్మాత: బి నికిత జగదీష్, నిర్మాత; బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం; :ఆర్యన్ సుభాన్ SK.

Updated Date - Jun 20 , 2024 | 08:32 PM