Pushpa 2: పుష్ప 2 న్యూ పోస్టర్.. పుష్ప 3 కూడానా?

ABN, Publish Date - Oct 17 , 2024 | 12:00 PM

పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. ఓ వైపు గ్లిమ్స్‌, సాంగ్స్ అప్డేట్స్‌కి మంచి ఆదరణ లభించగా.. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు సినిమాపై హైప్‌ను అమాంతం పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ని నిర్మాతలు విడుదల చేశారు. ఆ పోస్టర్ ఎలా ఉందొ మీరు చూసేయండి.

Pushpa 2 Poster

మూడేళ్ళుగా బన్నీ(Allu Arjun) ఫ్యాన్స్, యావ‌త్ దేశం ఎంతో అస‌క్తిగా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప 2( Pushpa 2). అనేక కారణాల వల్ల ఈ సినిమా షూట్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ క్రమంలో సినిమా రిలీజ్ డేట్ కూడా రెండు మూడు సార్లు మార్చారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సుకుమార్(Sukumar) సినిమాని జెట్ స్పీడ్‌లో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఓ వైపు గ్లిమ్స్‌, సాంగ్స్ అప్డేట్స్‌కి మంచి ఆదరణ లభించగా.. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు సినిమాపై హైప్‌ను అమాంతం పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ని నిర్మాతలు విడుదల చేశారు. ఆ పోస్టర్ ఎలా ఉందొ మీరు చూసేయండి.


ఇప్పటికే సినిమా చిత్ర బృందం ప్రకటించినట్లే సినిమాని డిసెంబర్ 6న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌కి 50 రోజుల కౌంట్ డౌన్ మొదలుపెడుతూ.. ఓ పోస్టర్‌ను వదిలారు. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ కాలుపై కాలేసుకుని కుర్చీలో ఫుల్ స్వాగ్‌తో కనిపిస్తున్నాడు. దీంతో ఫుల్ ఖుషికి గురవుతున్న బన్నీ ఫ్యాన్స్ అస్సలు తగ్గేదే లే అంటున్నారు.


తాజాగా పుష్ప 2 లో తన పాత్రకు సంబంధించి షూటింగ్‌ పూర్తయిందని తెలియజేస్తూ నటుడు బ్రహ్మాజీ ఓ ఫొటో షేర్ చేసారు. అందులో బ్రహ్మాజీ, సుకుమార్‌, మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌‌తోపాటు యానిమల్‌ ఫేమ్‌ సౌరభ్‌ సచ్‌దేవ కనిపించారు. యానిమల్‌‌లో బాబీ డియోల్‌కు సోదరుడిగా నటించి ఆకట్టుకున్నారు సౌరభ్‌. యానిమల్ క్లైమాక్స్‌లో సౌరభ్‌కు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. పుష్ప 3 కూడా ఉండనుందన్న వార్తల నేపథ్యంలో సుకుమార్ పుష్ప 2 క్లైమాక్స్‌లో ఇంట్రెస్టింగ్ లీడ్ ఇచ్చి ఎండ్ చేయనున్నారని.. అందులో భాగంగానే సౌరభ్ పాత్ర ఉంటుందని తెలుస్తొంది.

Updated Date - Oct 17 , 2024 | 04:48 PM