Nenu Keerthana: బ్లాక్ బస్టర్ ఎలిమెంట్స్ అన్నీ.. ఈ చిత్రంలో పుష్క‌లంగా ఉన్నాయి

ABN, Publish Date - Aug 12 , 2024 | 08:04 AM

చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన‌ చిత్రం నేను కీర్తన.ఈ చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్, ట్రైలర్ రిలీజ్ వేడుక జరిగింది.

nenu keethana

చిమటా రమేష్ బాబు (Chimata Ramesh Babu)హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన‌ చిత్రం నేను కీర్తన (Nenu Keerthana). రిషిత, మేఘన హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్, ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.

ఈ సందర్భంగా హీరో కమ్ డైరెక్టర్ రమేష్ బాబు (Chimata Ramesh Babu) మాట్లాడుతూ ఈ చిత్ర రూపకల్పనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన సోదరి జ్యోతిర్మయి, తన జీవిత భాగస్వామి లక్ష్మీ కుమారిల సపోర్ట్ లేకుంటే.. ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది కాదని పేర్కొన్నారు. ఒక మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి అవసరమైన ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.


తన సోదరుడు నటించిన సినిమా అని అనడం లేదని, "నేను-కీర్తన" పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చిత్ర సమర్పకురాలు చిమటా జ్యోతిర్మయి పేర్కొన్నారు. నిర్మాత చిమటా లక్ష్మీ కుమారి మాట్లాడుతూ.. "ఎన్నో వ్యయప్రయాసలతో మల్టీ జోనర్ ఫిల్మ్ గా రూపొందించిన ఈ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Updated Date - Aug 12 , 2024 | 08:04 AM