Mr.Celebrity: జావెద్ అలీ వోక‌ల్.. ‘నీ జతగా’ మెలోడీ సాంగ్‌ రిలీజ్ చేసిన గోపీచంద్

ABN, Publish Date - Sep 23 , 2024 | 05:27 PM

ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ మ‌నుమ‌డు సుదర్శన్ పరుచూరి హీరోగా రూపొందుతున్న చిత్రం మిస్టర్ సెలెబ్రిటీ. తాజాగా ఈ సినిమాలోని నీ జ‌త‌గా అంటూ సాగే లిరిక‌ల్ వీడియోను మాచో స్టార్ గోపీచంద్ రిలీజ్ చేశారు.

Mr.Celebrity

ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ మ‌నుమ‌డు సుదర్శన్ పరుచూరి (Sudarshan Paruchuri) హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం మిస్టర్ సెలెబ్రిటీ (Mr. Celebrity). వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar), శ్రీ దీక్ష (Sri Deeksha), నాజర్ (Nasar), రఘుబాబు (Raghubabu ) వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తుండ‌గా రవి కిషోర్ (Ravi Kishore) దర్శకత్వం వ‌హించాడు. ఆర్‌పి సినిమాస్ బ్యానర్‌పై చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమాను ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారు.

అయితే ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్, టీజర్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఈ సినిమా నుంచి నీ జ‌త‌గా అంటూ సాగే లిరిక‌ల్ వీడియోను మాచో స్టార్ గోపీచంద్ రిలీజ్ చేశారు. ఈ మెలోడీ పాటను గణేశా రచించగా.. జావెద్ అలీ ఆలపించారు. వినోద్ యాజమాన్య చక్కటి సోల్ ఫుల్ బాణీని అందించారు.

ఈ సంద‌ర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. ‘పరుచూరి వెంకటేశ్వరరావు గారి మనవడు హీరోగా చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌ను చూశాను. చాలా బాగుంది. ఇప్పుడు పాటను రిలీజ్ చేశాను. సాంగ్‌ కూడా బాగుంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్. చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్ర‌స్తుతం సెల‌బ్రిటీల‌పై రూమర్లు, పుకార్లను బేస్ చేసుకుని ఈ కథను ప్రజెంట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా తెరకెక్కించినట్టుగా టీజ‌ర్‌లో కనిపిస్తోంది. సాధారణ వ్యక్తి నుంచి సెలెబ్రిటీల వరకు ఇబ్బంది పడే ఇష్యూని, చిన్న సమస్యలే కదా? చిన్న మాటలే కదా? అనిపించొచ్చు. కానీ ఎంత ప్రభావం చూపిస్తుందో ఈ సినిమాలో ఉంటుందని దర్శకుడు రవి కిషోర్ తెలిపారు.

Updated Date - Sep 23 , 2024 | 05:27 PM