మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NBK 109 glimpse: జాలి, దయ, కరుణ తెలియనివాడు కావాలి!

ABN, Publish Date - Jun 10 , 2024 | 12:26 PM

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి అదిరిపోయే అప్‌డేట్స్‌ వస్తున్నాయి.

నందమూరి బాలకృష్ణ (Balakrishna) పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి అదిరిపోయే అప్‌డేట్స్‌ వస్తున్నాయి. తాజాగా ఆయన హీరోగా బాబీ (కొల్లి రవీంద్ర) దర్శకత్వంలో NBK 109 (NBK 109) చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే! సితార ఎంటర్‌టనమెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. సోమవారం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి పవర్‌ఫుల్‌ గ్లింప్స్‌ విడుదల చేశారు. (HBD balayya)

ఇందులో హీరో క్యారెక్టర్‌ను వివరిస్తూ మకరంద్‌ పాండే చెప్పే డైలాగ్‌లు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. "దేవుడు చాలా మంచోడయ్యా... దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ల అంతు చూడాలంటే కావాల్సింది జాలి, దయ కరుణ వీటి అర్థాలే తెలియని అసురుడు’ అంటూ చెప్పిన డైలాగ్‌లు అభిమానులచే చప్పట్లు కొట్టించేలా ఉన్నాయి. ఈ టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి! 

Read more!
Updated Date - Jun 10 , 2024 | 02:19 PM