Navdeep : ఏంటన్నా.. ఈసారి నువ్వు ఫేక్ న్యూస్‌లో కనిపించడంలేదు
ABN, Publish Date - May 26 , 2024 | 04:51 PM
బెంగళూరులో రేవ్ పార్టీ (Rave party) ఇప్పుడు ఎక్కడ చూసిన హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో తెలుగు నటి హేమ (Hema) పేరు కూడా వినిపించడంతో మరింత హాట్ టాపిక్ అయింది.
బెంగళూరులో రేవ్ పార్టీ (Rave party) ఇప్పుడు ఎక్కడ చూసిన హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో తెలుగు నటి హేమ (Hema) పేరు కూడా వినిపించడంతో మరింత హాట్ టాపిక్ అయింది. తాజాగా దీనిపై నవదీప్ (Navdeep) స్పందించారు. బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లినట్టు రూమర్స్ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని భావిస్తున్నట్లు నటుడు నవదీప్ అన్నారు. ‘ఏంటన్నా. ఈసారి నువ్వు ఫేక్ న్యూస్‌లో కనిపించడంలేదు’ అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడుగుతున్నారని ఆయన తెలిపారు. తన కొత్త సినిమా ‘లవ్ మౌళి’ ప్రచారంలో ప్రచారంలో పాల్గొన్న ప్రెస్మీట్లో రేవ్ పార్ట్టీ గురించి ప్రశ్న ఎదురవగా ఆయన స్పందించారు. ‘చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా ఏదైనా అంశం సంచలనంగా మారితే.. మీపై ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు’ అంటూ ఓ రిపోర్టర్ అడగగా.. మంచే జరిగిందని, ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ సమాధానమిచ్చారు నవదీప్. రేవ్ పార్టీ అంటే.. రేయి, పగలు జరిగేదని ఆయన చెప్పారు. ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా చేసుకుంటారన్నారు.
ఇంకా పరిశ్రమలో వచ్చిన మార్పుల గురించి ఆయన మాట్లాడుతూ ‘‘కరోనా టైమ్‌లో ప్రేక్షకులకు ‘ఓటీటీ’ బాగా దగ్గరైంది. ఇంట్లో కూర్చొనే అన్ని భాషా చిత్రాలను వీక్షిస్తున్నారు. ఎంటర్టైనమెంట్ మన అర చేతిలోకి వచ్చేసింది. విజువల్ ఫీస్ట్ అనిపించే అగ్ర హీరోల సినిమాలు చూసేందుకు తప్ప థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదు. థియేటర్లలో విడుదలైన రెండు, మూడు వారాలకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయని ఆడియన్స ఫిక్స్ అయిపోయారు. మా సినిమా విషయానికొస్తే ఈ సినిమా నిర్మాణం ఎలా జరిగిందన్న దానిపై ఓ సినిమా తీయొచ్చు. చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం’’ అని అన్నారు. రొమాంటిక్ డ్రామాగా అవనీంద్ర తెరకెక్కించిన ఈ మూవీ జూన్ 7న విడుదల కానుంది.