సౌత్ సినిమా+ -

వైరల్+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

Nani: పోతారు మొత్తం పోతారు.. 'సరిపోదా శనివారం' ట్రైల‌ర్ రిలీజ్‌

ABN, Publish Date - Aug 13 , 2024 | 08:48 PM

నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం. తాజాగా ఈరోజు సుదర్శన్ 35 MM థియేటర్‌లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు.

నేచురల్ స్టార్ నాని (Nani), వివేక్ ఆత్రేయ (Vivek Athreya) మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram). ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈరోజు సుదర్శన్ 35 MM థియేటర్‌లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య సినిమా థియేట్రికల్ ట్రైలర్ (Saripodhaa Sanivaaram Trailer)ను లాంచ్ చేశారు. కాగా ట్రైల‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా సుద‌ర్శ‌న్ థియేట‌ర్ వద్దకు నాని అభిమానులు భారీ సంఖ్య‌లో చేరుకుని హంగామా సృష్టించారు.

టీజర్ సినిమాలోని రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని పరిచయం చేయగా, ట్రైలర్ కాన్ప్లిక్ట్‌ని ప్రజెంట్ చేసింది. సీఐ దయానంద్ చిన్న చిన్న కారణాలతో ఇతరులపై దాడి చేసే క్రూరమైన వ్యక్తి. సాధారణ మధ్యతరగతి కుర్రాడైన సూర్య తన చుట్టూ ఉన్నవారికి అన్యాయం జరిగితే సహించలేడు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇంటెన్స్ వార్‌ను ట్రైలర్‌లో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. న‌టుల పెర్ఫార్మెన్స్,టెక్నికల్ వాల్యూస్ ఎక్స్ ట్రార్డినరీగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ నెరేటివ్ అదిరిపోయింది. మొత్తంగా సినిమా ట్రైల‌ర్‌ మొదటి నుండి చివరి వరకు ఆడియన్స్ ని కట్టి పడేసింది.

saripodhaasanivaaram.jpg

ఇక ట్రైల‌ర్‌లో నాని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆదరగొట్టారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా అనిపించింది. ఎస్‌జె సూర్య డైనమిక్ పాత్రలో కనిపించారు. ప్రియాంక మోహన్ నాని క్యారెక్టర్‌తో ప్రేమలో ఉన్న కానిస్టేబుల్‌గా ఆకట్టుకుంది. అదేవిధంగా మురళి జి సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉండ‌గా.. జేక్స్ బిజోయ్ తన అద్భుతమైన స్కోర్‌తో నెరేటివ్ ని ఎలివేట్ చేశారు. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి చాలా గ్రాండ్ గా సినిమాని నిర్మించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ఈ ట్రైలర్ అంచనాలను మ‌రింత‌గా పెంచింది.

GU3uGAYXMAAKtrF.jpeg

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. సుదర్శన్ థియేటర్ నాకు చాలా స్పెషల్. మీ అందరితో కలసి ఈ ట్రైలర్ చూడటం చాలా హ్యాపీగా ఉంది. ఈ మంత్ ఎండ్ కి అదిరిపోతుంది. మీ అందరితో కలసి సినిమా ఇక్కడే చూస్తాను. మీ అందరికీ ప్రేమకి థాంక్. మీరు ఇలానే ప్రేమ చూపిస్తూ ఉంటే వందశాతం కష్టపడి మీకు మంచి మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తునే ఉంటాన‌న్నారు. చివ‌ర‌గా సినిమాలో నుంచి 'నాకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చిందటే వీళ్ళు నా మనుషులు, వాళ్ళ సమస్య నా సమస్య. వాళ్ళ సంతోషం నా సంతోషం'. అందుకే ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అనే డైలాగ్ చెప్పి ఫ్యాన్స్‌ను ఉత్సాహా ప‌రిచాడు. ఆగస్ట్ 29న సరిపోదా శనివారం. థియేటర్స్ లో సెలబ్రేట్ చేసుకుందాం' అన్నారు,


GU3Rbf2XsAAEXYG.jpeg

యాక్టర్ SJ సూర్య (SJSURYAH) మాట్లాడుతూ.. మీ అందరిని కలవడం ఆనందంగా ఉంది. ట్రైలర్‌కి మించి సినిమా ఉంటుంది. సినిమా సూపర్ గా వచ్చింది. ఫెంటాస్టిక్ మూవీ. నాని కష్టపడి వచ్చారు. మీ అందరి సపోర్ట్ తో ఎదిగారు. ఆయన మంచి మనిషి. ఆయన మంచి మనసుకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. నాని గారి ఈ సినిమాలో శనివారం బాషా. డి.వి.వి దానయ్య గారు చాలా భారీగా ఖర్చు చేసి ఈ సినిమా చేశారు. సోకులపాలెం అనే ఒక ఏరియాని ఫుల్ సెట్ లో వేశారు. అది చాలా బాగా వచ్చింది. చాలా మంచి కంటెంట్, ఎనర్జీ ఉవున్న సినిమా ఇది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది' అన్నారు.

nani.jpg

హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) మాట్లాడుతూ.. చాలా రోజుల మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. నాని గారితో గ్యాంగ్ లీడర్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. ఆగస్ట్ 29న అందరూ ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడండి' అన్నారు. నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ.. సరిపోదా శనివారం సినిమా మైండ్ బ్లోయింగ్. నాని గారు సూర్య గారు కెమిస్ట్రీ అదుర్స్. సినిమా బ్లాక్ బస్టర్' అన్నారు. హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ .. ట్రైలర్ అదిరిపోయింది. డైలాగ్స్ చాలా బావున్నాయి, నాకు చాలా నచ్చాయి. నాని సూపర్ గా చేశారు. సూర్య సర్ స్వాగ్ అదిరిపోయింది. ఆగస్ట్ 29 న ఫీస్ట్ ఉంటుంది' అన్నారు.

Updated Date - Aug 13 , 2024 | 09:02 PM