Kali Movie: రిలీజ్‌కు సిద్ధ‌మైన.. ప్రిన్స్, నరేష్ అగస్త్య సైకలాజికల్ థ్రిల్లర్ ’కలి‘

ABN, Publish Date - Sep 16 , 2024 | 06:16 PM

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన చిత్రం కలి. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

kali

యంగ్ హీరోలు ప్రిన్స్ (Prince), నరేష్ అగస్త్య (Naresh Agastya) నటిస్తున్న సినిమా కలి (Kali Movie). ఈ చిత్రాన్ని ప్రముఖ కథా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి (Raghavendra Reddy) సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు (Siva Sashu) రచనతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న (October 4th) గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. కలి (Kali Movie) పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మూవీ టీమ్ చెబుతోంది.

Updated Date - Sep 16 , 2024 | 06:16 PM