NTR: ఎన్టీఆర్‌కు హాలీవుడ్, బాలీవుడ్ అవకాశాలు వచ్చినా తిరస్కరించారు.. ఎందుకంటే?
ABN, Publish Date - Jan 18 , 2024 | 03:27 PM
మరణం లేని మహానుభావుడు ఎన్టీఆర్ అని అన్నారు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్. లెజెండ్ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఫిలింనగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూప.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రెటరీ టి. ప్రసన్న కుమార్ తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మరణం లేని మహానుభావుడు ఎన్టీఆర్ (NTR) అని అన్నారు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్. లెజెండ్ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి (NTR Death Anniversary) సందర్భంగా ఫిలింనగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూప.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath), తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రెటరీ టి. ప్రసన్న కుమార్ (T Prasanna Kumar), ఎఫ్ఎన్‌సిసి సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి మరియు ఎక్స్ కార్పొరేటర్ కాజ సూర్యనారాయణ (Kaja Suryanarayana).. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో రారాజు ఎన్టీఆర్. రాముడుగా, రావణుడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా ఇలా ఏ ప్రాత చేయాలన్నా నందమూరి తారక రామారావు గారే. నాయకుడిగా ప్రతి నాయకుడిగా ఇరుపాత్రలతోను మెప్పించగల హీరో ఎవరన్నా ఉన్నారంటే అది ఎన్టీఆర్ గారే. హిందీలో మూడు సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్న హీరో. హాలీవుడ్, బాలీవుడ్ అవకాశాలను తిరస్కరించి నేను తెలుగు వాడిని తెలుగు తెలుగు వాళ్లకే నే సొంతం.. తెలుగు వాళ్లకే నా సేవలు అంకితం అని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావుగారు. ఇవాళ పాన్ ఇండియా, హాలీవుడ్, బాలీవుడ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాం కానీ ఇవన్నీ ఆయనకు ఎప్పుడో వచ్చినా.. తిరస్కరించి తెలుగు జాతి కోసమే నిలబడిన వ్యక్తి ఆయన. ఆ రోజుల్లో రోజుకు లక్ష రూపాయలు తీసుకున్న నటుడు లేడు.. అలాంటిది ఎన్టీఆర్‌గారు రోజుకు లక్ష రూపాయలు తీసుకున్న నటుడిగా.. తన కోసమో తన కుటుంబం కోసమో కాకుండా ప్రజల కోసం ఏదైనా చేయాలి అని పార్టీ పెట్టి సంపాదించిన దాంట్లో ప్రజల కోసం సేవ చేసిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఫిలిం నగర్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఉంది అని మనం గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్పేలాగా ఈ రోజున ఈ కార్యక్రమం జరగడం ప్రతి తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ నా ధన్యవాదాలు.. అని తెలిపారు.
నందమూరి మోహన కృష్ణ (Nandamuri Mohana Krishna) మాట్లాడుతూ.. మరణం లేని తెలుగు జాతి గౌరవం మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు. భౌతికంగా మా నుండి దూరమై 28 ఏళ్లు గడిచినా మనసా - ఆలోచనల్లోనూ, వాచా - మా మాటల్లోనూ, కర్మణా - మా చేతల్లోనూ మాతోనే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు పెను సంచలనం. సినిమాల్లో గాని, రాజకీయాల్లో గాని ఎన్టీఆర్ అనే పేరు చెరగని ముద్ర వేసుకుంది. సినిమాల్లో ఆయన వేయని పాత్ర అంటూ ఏదీ లేదు. కథానాయకుడు గానే కాకుండా ప్రతి నాయకుడు పాత్రల్లో కూడా నటించి మెప్పించారు. రాజకీయాల్లోనూ పెను మార్పులు తీసుకొచ్చారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల వ్యవధిలోనే ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు ఆయనే ఆద్యుడు. ఆయన ఎప్పుడూ అందరివాడే. ఈరోజు అన్ని పార్టీలు కూడా ఆయన పేరుని ఆయన సంక్షేమ పథకాలను వాడుకుంటున్నాయి. ఆయన ఎప్పుడూ అజాతశత్రువే. దైవం మానుష్య రూపేనా అన్నట్టు ఎన్టీఆర్‌గారు మనుషులలో దైవం. ఆయనకు నివాళులర్పించడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎక్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, నందమూరి మోహన రూప తదితరులు ప్రసంగించారు.
ఇవి కూడా చదవండి:
====================
*Pawan Kalyan: కన్నీరు తెప్పించావు.. జనసైనికుల లేఖలు చూసి పవన్ భావోద్వేగం
****************************
*Rajinikanth: రజనీ అభిమానులతో పొరుగింటి వృద్ధ మహిళ వాగ్వాదం
*************************
*ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం: బాలకృష్ణ
**************************
*Ayalaan: కోలీవుడ్‌లో సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా.. టాలీవుడ్‌లో ఎప్పుడంటే?
****************************