Hanuman: హనుమాన్‌తో.. ప్రేక్షకులను మాయ చేశారు: బాలకృష్ణ
ABN, Publish Date - Jan 17 , 2024 | 04:17 PM
హనుమాన్ చిత్రం జనవరి 12న విడుదలై సునామీని సృష్టిస్తూ సినిమాకు ఎల్లలు లేవనే సూత్రాన్ని మరోసారి రుజువు చేస్తోంది. తాజాగా ఈ హనుమాన్ సినిమాను కర్ణాటకలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, హైదరాబాద్‌లో నటసింహం బాలకృష్ణ తిలకించి చిత్ర యూనిట్‌ను అభినందించారు.
హనుమాన్ (Hanu Man) చిత్రం జనవరి 12న విడుదలై హనుమేనియా సునామీని సృష్టిస్తూ భక్తికి, సినిమాకు ఎల్లలు లేవనే సూత్రాన్ని మరోసారి రుజువు చేస్తోంది. చిత్రం విడుదలైన అనంతరం రోజురోజుకు ఒక్క తెలుగులోనే కాకుండా రాష్ట్రాలను దాటి సౌత్, నార్త్ ఇండియా ప్రేక్షకాభిమానాన్ని చూరగొంటుంది., థియేటర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతూ సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నది. తెలుగు ప్రేక్షకులే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతుండడంతో ఈ సినిమా క్రేజ్ ఇప్పట్లో తగ్గదని తెలుస్తోంది.
అంతేకాకుండా నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) నిన్న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో కుటుంబ సమేతంగా చిత్ర యూనిట్‌తో కలిసి హనుమాన్ (Hanu Man) సినిమాను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినిమాలో కంటెంట్ బావుందని, టెక్నికల్ డిపార్ట్ మెంట్‌ను మంచిగా వాడుకున్నారని, కథను మంచిగా హ్యాండిల్ చేశారని, కనుల పండువగా, కనులకు ఐ పీస్ట్‌గా ఉందన్నారు. సినిమాలో ఫొటోగ్రఫీ, సంగీతం, నటీనటుల యాక్టింగ్, విజువల్స్ ప్రతి విభాగం అధ్బుతంగా పని చేసిందన్నారు. మీ సినిమాతో ప్రేక్షకులను మాయ చేశారని, రెండో భాగం కోసం ఎదురు చూస్తున్నా అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఆ అంజనేయుని అశీస్సులు మీకున్నాయని అన్నారు.
తాజాగా ఈ హనుమాన్ (Hanu Man) సినిమాను కర్ణాటకలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Shiva rajkumar) ప్రత్యేక షో వేయించుకుని చూశారు. అనంతరం హనుమాన్ చిత్ర యూనిట్‌తో సమావేశమై వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. నేటి సమాజానికి ఇలాంటి సినిమాలు చాలా ఆవశ్యకమని, మన సనాతన ధర్మాలు,వేదాలు ప్రతి ఒక్కరికి చేరాలన్నారు. ఇలాంటి అధ్బుత చిత్రాన్ని తీసిన ప్రశాంత్ వర్మ (Prasanth Varma), నిర్మాత నిరంజన్ రెడ్డి, నటీనటులు తేజ (tejasajja), అమృత (Amritha), వరలక్ష్మి, వినయ్ లను ప్రత్యేకంగా అభినందించారు.