Allu Arjun: అల్లు అర్జున్.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు..
ABN, Publish Date - Dec 13 , 2024 | 04:25 PM
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్టయిన అల్లు అర్జున్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరు పరిచారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్టయిన అల్లు అర్జున్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరు పరిచారు. నాంపల్లి కోర్టు 14రోజులు జ్యూడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.
అసలు ఏం జరిగిందంటే..
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే విడుదలకు ముందురోజు రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రదర్శించబడిన ప్రీమియర్‌కు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి ఓ కుటుంబంలో విషాదం నింపింది. ‘పుష్ప2’ సినిమాను చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపై నమోదైంది.