Biggboss 8: నైనిక అవుట్‌..  ఒక్కొక్కరికి గట్టిగా ఇచ్చేసింది

ABN, Publish Date - Oct 07 , 2024 | 11:49 AM

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8 (Biggboss8) మొదలై 35 రోజులు అయింది. ఇప్పటికీ ఆరుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్‌ అయ్యారు.


బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8 (Biggboss8) మొదలై 35 రోజులు అయింది. ఇప్పటికీ ఆరుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్‌ అయ్యారు. తాజాగా ఈ వారం డాన్సర్‌ నైనిక (Nainika) ఎలిమినేట్‌ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్‌ ఎలా జరిగిందో చూసేద్దాం. ‘జవాన్‌’ టైటిల్‌ సాంగ్‌, ‘గేమ్‌ గేమ్‌ ఛేంజర్‌’ నుంచి రీసెంట్‌గా రిలీజైన ‘రా మచ్చా’ పాటకు స్టెప్పులేసి ఆదివారం ఎపిసోడ్‌కి నాగార్జున (Nagarjuna) ఎంట్రీ ఇచ్చారు. వచ్చీ రాగానే డేంజర్‌ జోన్‌లో ఉన్న మణికంఠ, విష్ణుప్రియ, నైనికని నిలబెట్టారు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలను ఎలా ఎదుర్కోబోతున్నారో హౌస్‌మేట్స్‌ను అడగ్గా వారంతా సిద్థంగా ఉన్నట్లు తెలిపారు. నైనిక ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించడంతో సీత ఎప్పటిలాగే కన్నీరుమున్నీరైంది. తదుపరి వేదికపైకి వచ్చిన నైనికను హౌసులో ఎవరు ఎలాంటి వారు అని హోస్ట్‌ నాగ్‌ అడగ్గా..

ప్రేరణ మ్యానిప్యులేటర్‌,

మణికంఠ వెన్నుపోటు పొడిచే వ్యక్తి,

విష్ణుప్రియ నకిలీ స్నేహితురాలు,

పృథ్వీ అటెన్షన్‌ సీకర్‌,

నబీల్‌ అవకాశవాది,

సీత నిజమైన ఫ్రెండ్‌,

నిఖిల్‌ గేమ్‌ ఛేంజర్‌,

యష్మిది మంద బుద్థి అని చెప్పింది.



ఈ వారం హౌస్‌మేట్స్‌ కోసం ఉత్తరాలు వచ్చాయి. కానీ అవి కొందరికి అందకుండానే వెనక్కు వెళ్లిపోయాయి. వాటిని నాగ్‌ తిరిగి తీసుకొచ్చాడు. సీత, నబీల్‌, యష్మి, మణికంఠ తమ లెటర్స్‌ అందుకుని ఎమోషనల్‌ అయ్యారు. ఇక హౌస్‌లో ఉన్న ఎనిమిది మంది ఓజీ (ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్స్‌) టీమ్‌గా, కొత్తగా వచ్చే ఎనిమిది వైల్డ్‌ కార్డ్స్‌ రాయల్‌ టీమ్‌గా ఉంటాయని నాగ్‌ చెప్పారు.

అలాగే ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఎనిమిది మంది కంటెస్టెంట్లను ఇంట్లోకి ఆహ్వానించారు. వీరంత బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ నుంచి ఏడో సీజన్‌ వరకూ షోలో భాగమైన వారే కావడం విశేషం.

Updated Date - Oct 07 , 2024 | 12:01 PM