మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nagarjuna: నాగ్‌ తదుపరి సినిమా క్లారిటీ వచ్చింది

ABN, Publish Date - Apr 30 , 2024 | 10:35 AM

కింగ్‌ నాగార్జున (Nagarjuna) దూకుడు పెంచారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'కుబేర' (kubera) చిత్రం చేస్తున్నారు. తర్వాత చేయనున్న చిత్రం గురించి కూడా స్పష్టత వచ్చింది.

కింగ్‌ నాగార్జున (Nagarjuna) దూకుడు పెంచారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'కుబేర' (kubera) చిత్రం చేస్తున్నారు. తర్వాత చేయనున్న చిత్రం గురించి కూడా స్పష్టత వచ్చింది. స్టూడియో గ్రీన్‌  బ్యానర్‌పై తమిళ దర్శకుడు నవీన్‌తో (Director Naveen) ఓ సినిమా చేయనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని టాక్‌. ఇందులో బాబీ దేవోల్‌ (bobby deol) ప్రధాన పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఇందులో బలమైన ప్రతినాయకుడిగా ఆయన కనిపించనున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.  జూన్‌ నెలాఖరు నుంచి చిత్రీకరణనువ రప్రారంభం కానుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా ఇద్దరు కథానాయికలు కనిపించనున్నారు. అయితే వారిద్దరూ ఎవరనేది తెలియాల్సి ఉంది.

Puri Musings: ఇవన్నీ బతికి ఉండడం వల్ల వచ్చిన సమస్యలు!



అలాగే నాగార్జున, ధనుష్‌ కీలక పాత్రల్లో శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్త్ను ‘కుబేర’ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి మే 2న ప్రచార చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ‘‘ఓ భారీ పిడుగును సీజ్‌ చేసి లోడ్‌ చేయడం జరిగింది’’ అని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది. 

Read More: Tollywood, Cinema News, Bollywood

Updated Date - Apr 30 , 2024 | 10:44 AM