Naga Vamsi: పొరపాటు పట్టుకుంటే పార్టీ ఇస్తా..

ABN, Publish Date - Oct 21 , 2024 | 09:19 PM

'లక్కీ భాస్కర్‌' చిత్రంపై నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో లాజిక్‌ మిస్‌ అవడం ఉండదనుకుంటున్నానని అన్నారు.

'లక్కీ భాస్కర్‌' (Lucky Bhaskar) చిత్రంపై నిర్మాత నాగవంశీ (Naga vamsi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో లాజిక్‌ మిస్‌ అవడం ఉండదనుకుంటున్నానని అన్నారు. ఒకవేళ ఎవరైనా చూపిస్తే పొరపాట్లను చూపిస్తే పార్టీ ఇస్తానని అన్నారు. ఆ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.  సినిమా బాగుంటుందని, మంచి వసూళ్లు వస్తాయని నాగవంశీ నమ్మకంగా చెప్పారు. తెలుగులో ఈ మధ్యకాలంలో ఎవరూ టచ్‌ చేయని నేపథ్యంతో రూపొందిన సినిమా ఇదన్నారు.


అనంతరం ‘కల్కి 2’లో (Kalki 2)కనిపిస్తారా? అనే ప్రశ్నపై దుల్కర్‌ స్పందిస్తూ.. ‘‘కల్కి పార్ట్‌ 1లో ఉంటాననే సంగతే నాకు తెలియదు. సడెన్‌గా షూటింగ్‌లో పాల్గొన్నా. ఈ ప్రశ్నను మీరు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ను అడగాలి అన్నారు.  ‘లక్కీభాస్కర్‌’ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి జానర్‌ సినిమా నేను మలయాళంలోనూ చేయలేదు. స్క్రిప్ట్ వినగానే నచ్చింది’’ అని తెలిపారు. కిరణ్‌ అబ్బవరం నటించిన ‘క’ సినిమాని దుల్కర్‌కు చెందిన నిర్మాణ సంస్థ మలయాళంలో విడుదల చేయనుంది. ‘లక్కీ భాస్కర్‌’, ‘క’ ఒకే రోజు రిలీజ్‌ అవడం గురించి మాట్లాడుతూ.. రిలీజ్‌ డేట్‌, సక్సెస్‌ మన చేతుల్లో ఉండదని, రెండు సినిమాలు విభిన్న కథాంశాలతో రూపొందాయని పేర్కొన్నారు. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వెంకీ అట్లూరి రూపొందించిన చిత్రమిది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌. సినిమాని ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

Updated Date - Oct 21 , 2024 | 09:19 PM