Nagababu: చట్టం తన పని తాను చేసుకుపోతోంది
ABN, Publish Date - Sep 30 , 2024 | 06:10 PM
సనాతన ధర్మంపై హిందువులే హిందువులను అవమానించటం కరెక్ట్ కాదు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అదే విషయాన్ని ప్రస్తావించారు’’ అని జనసేన (Janasena) జాతీయ కార్యదర్శి నాగబాబు అన్నారు.
సనాతన ధర్మంపై హిందువులే హిందువులను అవమానించటం కరెక్ట్ కాదు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అదే విషయాన్ని ప్రస్తావించారు’’ అని జనసేన (Janasena) జాతీయ కార్యదర్శి నాగబాబు అన్నారు. హిందూ ధర్మం ప్రమాదంలో ఉందనడానికి లడ్డూ అంశం క్లైమాక్స్ లాంటిదని అన్నారు. సనాతన ధర్మం బతకడం నేర్పించిందని, దానికి అన్యాయం జరుగుతోందనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారని నాగబాబు అన్నారు. సోమవారం ఆయన ఓ వేడికపై మాట్లాడుతూ పవన్ కల్యాణ్ మాటలను పూర్తిగా సమర్థిస్తున్నా. హిందూ దేవాలయాలు, ధార్మిక మండళ్లు హిందువులే నిర్వహించాలి. పవన్ కల్యాణ్ అసలైన సెక్యులర్. పవన్‌ను విమర్శించేవారు సూడో సెక్యులర్స్. డిక్లరేషన్ గురించి ఒక్కటే మాట. అన్నీ మతాలను అందరూ గౌరవించాలి. లడ్డూ కల్తీపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దోషులంతా బయటకు వస్తారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు. వైకాపా నాయకులు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాల నిర్ణయాలు కోట్లాది మంది హిందువులపై ప్రభావం చూపుతున్నాయనేదే పవన్ కల్యాణ్ బాధ. అన్ని మతాలతో కలిసి ఉండే వ్యక్తి పవన్ కల్యాణ్. హిందూ ధర్మ రక్షణ మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరముంది’’ అని అన్నారు.