మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Naga Vamsi: త్రివిక్రమ్‌ మార్క్‌ కనిపించలేదన్నారు.. కానీ

ABN, Publish Date - Mar 26 , 2024 | 05:27 PM

పెద్ద హీరోల సినిమాలు లాజిక్‌తో పని లేదంటున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga vamsi). స్టార్‌ హీరోల సినిమాల్లో ఎలివేషన్స్‌ చూసి ఎంజాయ్‌ చేయాలి కామెంట్‌ చేయకూడదన్నారు.


పెద్ద హీరోల సినిమాలు లాజిక్‌తో పని లేదంటున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga vamsi). స్టార్‌ హీరోల సినిమాల్లో ఎలివేషన్స్‌ చూసి ఎంజాయ్‌ చేయాలి కామెంట్‌ చేయకూడదన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో ప్రతికూలంగా మాట్లాడేవారి గురించి స్పందించారు. ‘‘సలార్‌’(Salaar)లో ప్రభాస్‌ను చూసి ఎంతోమంది అభిమానులు ఎంజాయ్‌ చేశారు. కొందరు మాత్రం అందులోని సన్నివేశాల్లో లాజిక్‌ లేదని కామెంట్స్‌ చేశారు. ‘గుంటూరు కారం’లో కూడా హీరో తరచు హైదరాబాద్‌ వెళ్లినట్లు చూపించారు. వెంటనే ఎలా వెళ్తాడన్నారు. ఇలా మాట్లాడే వాళ్ల కోసం గుంటూరు నుంచి మొదలయ్యే మూడున్నర గంటల జర్నీని మూవీలో చూపించలేం కదా! ఈ చిత్రంపై రకరకాల కామెంట్స్‌ వచ్చాయి. మాస్‌ సీన్స్‌ లేవని, త్రివిక్రమ్‌ మార్క్‌ కనిపించలేదన్నారు. కానీ, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైయ్యాక చాలా బాగుందని మెసేజ్ లు 
పెడుతున్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సర్కారు వారి పాట’లో మహేశ్‌ బాబు మాస్‌ సాంగ్స్‌ చేశారు. వాటిని మించి ఉండాలని ‘గుంటూరు కారం’లో అలాంటి పాట పెట్టాం. దాన్ని చూసి ఎంజాయ్‌ చేయాలి. కానీ, ఆ టైమ్‌కు శ్రీలీల అక్కడకు రావడం, వెంటనే దుస్తులు మార్చుకోవడం లాంటి లాజిక్‌లు మాట్లాడకూడదు. సినిమాను వినోదం కోసమే తీస్తామని గమనించాలి. ఇండస్ట్రీలోనే గొప్ప రచయిత అని పేరున్న ఆయనకు సినిమా ఎలా తీయాలో నేర్పించాల్సిన అవసరం లేదు. చిత్రం బాగోలేదని కామెంట్‌ చేేస అర్హత ఎవరికైనా ఉంటుంది. కానీ, చిత్ర బృందం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడకూడదు’ అని నాగవంశీ పేర్కొన్నారు.

Updated Date - Mar 26 , 2024 | 05:27 PM