Naga Shourya: నాగశౌర్య యాక్షన్ ఎంటర్టైనర్ 

ABN, Publish Date - Aug 10 , 2024 | 05:26 PM

నాగ శౌర్య (Naga shourya) హీరోగా నూతన చిత్రాన్ని ప్రకటించారు. ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, వైవిఎస్ చౌదరి, శ్రీను వైట్ల వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో, అనేక విజయవంతమైన చిత్రాలకు సహ రచయితగా పని చేసిన  రామ్ దేశిన (రమేష్) (Ram Desina)ఈ చిత్రంతో  దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

నాగ శౌర్య (Naga shourya) హీరోగా నూతన చిత్రాన్ని ప్రకటించారు. ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, వైవిఎస్ చౌదరి, శ్రీను వైట్ల వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో, అనేక విజయవంతమైన చిత్రాలకు సహ రచయితగా పని చేసిన  రామ్ దేశిన (రమేష్) (Ram Desina)ఈ చిత్రంతో  దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు.

ఈ నూతన చిత్రం రెగ్యులర్ షూటింగ్ శనివారం  ప్రారంభమైయింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రంలో సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్‌లతో సహా ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పనిచేస్తుండగా హారిస్ జయరాజ్ తెలుగు సినిమాకి కంబ్యాక్ ఇస్తూ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను రాజీవ్ నాయర్ పర్యవేక్షించగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు. 

Updated Date - Aug 10 , 2024 | 05:30 PM