Naga Chaitanya: సంక్రాంతి బరిలో నాగ చైతన్య.. పోటీ తట్టుకోగలడా?

ABN, Publish Date - Oct 16 , 2024 | 10:57 AM

ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‌రిలీజ్ చేయడానికి గీత ఆర్ట్స్ ప్లాన్ చేసింది. ఇది వరకే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆలస్యం ఆవుతోస్తుంది. సినిమా కాన్సెప్ట్‌తోనే ఆడియెన్స్‌ని అట్ట్రాక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్‌పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.

Thandel Poster

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తన 'కస్టడీ' సినిమాతో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాడు. గతంలో ఆయన చేసిన సినిమాలతో పర్వాలేదనిపించిన.. ఒక స్ట్రాంగ్ మూవీతో టాలీవుడ్‌లో స్టార్ ఇంప్యాక్ట్ చూపించాలని ఎన్నో రోజుల నుండి ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కార్తికేయ -2 సినిమాతో నేషనల్ వైడ్ ఆడియెన్స్‌ని కట్టిపడేసిన డైరెక్టర్ చందు మొండేటితో ఓ సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో మలయాళీ బ్యూటీ సాయి పల్లవి రెండోసారి చైతూతో జతకట్టనుండగా.. ఈ సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‌రిలీజ్ చేయడానికి గీత ఆర్ట్స్ ప్లాన్ చేసింది. ఇది వరకే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆలస్యం ఆవుతోస్తుంది. సినిమా కాన్సెప్ట్‌తోనే ఆడియెన్స్‌ని అట్ట్రాక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్‌పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే..


ప్రేమమ్, సవ్యసాచి సినిమాలతో చైతన్యకి గుర్తుండిపోయే హిట్స్ ఇచ్చిన దర్శకుడు చందు మొండేటి.. పాన్ ఇండియా సక్సెస్ తర్వాత మరోసారి తన అదృష్టం పరీక్షించుకోకవడానికి చైతూతో 'తండేల్' అనే సరికొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. లవ్ స్టోరీ తర్వాత సాయి పల్లవి మరోసారి చైతూతో జత కట్టగా.. గీత ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మించింది. టైటిల్ రివీల్ ఆడియెన్స్‌‌‌లో ఆసక్తి నెలకొల్పిన ఈ సినిమా రిలీజ్‌పై ఉత్కంఠ రేగుతోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ డిసెంబర్ కి వాయిదాపడినట్లు టాక్ వినిపించిన మరింత ఆలస్యం కావొచ్చు అనే వార్తలు విన్పిస్తున్నాయి. దీంతో ఈ సినిమాని అక్కినేని ఫ్యామిలీకి ఎంతో కలిసొచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు రూమర్స్ వినపడుతున్నాయి.

Also Read- Jr NTR: ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక, సక్సెస్ మీట్ లేకపోవడంతో.. తారక్ ఏం చేశారంటే


ఇప్పటికే సంక్రాంతి పోటీలో తండ్రి 'విశ్వంభర' ని కాదని రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'‌తో దూసుకొస్తున్నాడు. ఇక బాలయ్య, బాబీ సినిమా పోటీలో ఉండనే ఉంది. మరోవైపు వెంకీ మామ, అనిల్ రావిపూడి సినిమాతో బరిలో ఉన్నారు. ఈ భారీ పోటీలో ఇంతకీ నాగ చైతన్య మూవీ రిలీజ్ చేస్తారా, లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు సాయి పల్లవి నటిస్తోన్న 'అమరన్' సినిమా ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకి రానుంది.

Also Read- RGV: సల్మాన్‌లో చావు భయం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - Oct 16 , 2024 | 10:57 AM