Naga Chaitanya: అభిమానులతో.. 'ప్రేమ్ నగర్' మూవీ చూసిన నాగచైతన్య

ABN, Publish Date - Sep 23 , 2024 | 09:38 PM

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 31 సిటీస్ లో ANR మూవీస్ ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగా నాగచైతన్య ప్రేమ్ నగర్ చిత్రాన్ని శాంతి థియేటర్‌లో అభిమానులతో కలిసి చూశారు.

anr

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నారు. హైదరబాద్ లో 'దేవదాసు' 4K స్క్రీనింగ్ తో ఫెస్టివల్‌ ఘనంగా ప్రారంభమైంది. 31 సిటీస్ లో ANR గారి 10 ఐకానిక్ మూవీస్ ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శిస్తున్నారు.

ఈ ఫెస్టివల్‌లో భాగంగా అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) తన తాతగారి క్లాసిక్ మూవీ ప్రేమ్ నగర్ (1971) చిత్రాన్ని శాంతి థియేటర్‌లో అభిమానులతో కలిసి చూశారు. ఈ సందర్భంగా అభిమానులు కోలాహలంతో థియేటర్లో పండగ వాతావరణం నెలకొంది.

ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'దేవదాసు' (1953), 'మిస్సమ్మ' (1955) 'మాయాబజార్' (1957), 'భార్య భర్తలు' (1961), 'గుండమ్మ కథ' (1962), 'డాక్టర్ చక్రవర్తి' (1964), 'సుడిగుండాలు' (1968), 'ప్రేమ్ నగర్' (1971), 'ప్రేమాభిషేకం' (1981) 'మనం' (2014) సహా ANR ల్యాండ్‌మార్క్ మూవీస్ దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు.

Updated Date - Sep 23 , 2024 | 09:38 PM