Thandel: అఫీషియ‌ల్.. తండేల్ రిలీజ్ డేట్

ABN, Publish Date - Nov 05 , 2024 | 04:43 PM

హీరో నాగ చైతన్య, డైరెక్టర్ చందు మొండేటి క‌ల‌యికలో ముచ్చ‌ట‌గా వ‌స్తున్న మూడో చిత్రం తండేల్ చిత్రం రిలీజ్ డేట్ ఎట్ట‌కేల‌కు మేక‌ర్స్‌ ప్ర‌క‌టించారు.

thandel

అనుకున్న‌ట్లే అయింది హీరో నాగ చైతన్య (Naga Chaitanya), డైరెక్టర్ చందు మొండేటి (Chandu Mondeti) క‌ల‌యికలో ముచ్చ‌ట‌గా వ‌స్తున్న మూడో చిత్రం తండేల్ (Thandel) సినిమా రిలీజ్ వాయిదా విష‌యంలో సోష‌ల్ మీడియాలో జ‌రిగిన.. జ‌రుగుతున్న ప్ర‌చారానికి చెక్ పెడుతూ మేక‌ర్స్ ఎట్ట‌కేల‌కు రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే చాలా కాలంగా ఈ సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో అనేక వార్త‌లు హాల్చ‌ల్ చేస్తున్న క్ర‌మంలో చిత్ర యూనిట్ స్పందించి ప్రెస్మీట్ పెట్టి మ‌రి ఆఫీషియ‌ల్ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో అక్కినేని అభిమానుల‌తో పాటు సాయి ప‌ల్ల‌వి ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఇటీవ‌ల వేర్వేరు సంద‌ర్భాల్లో ఈ సినిమా విడుద‌ల విష‌య‌మై వేరువేరు వేడుకలో భిన్నమైన కామెంట్స్ చేయడంతో తండేల్ రిలీజ్‌పై అస్ప‌స్ట‌త‌, సస్పెన్స్ ఏర్పడింది. మొద‌ట ఈ సినిమాను డిసెంబ‌ర్ 20న థియేట‌ర్ల‌లోకి తీసుకు వ‌ద్దామ‌ని మేక‌ర్స్ భావించిన‌ప్ప‌టికీ షూటింగ్ బ్యాల‌న్స్ ఉండ‌డంతో సినిమా విడుద‌ల వాయిదా ప‌డడంతో సినిమా సంక్రాంతికి వ‌స్తుంద‌ని భావించారు. కానీ స‌డ‌న్‌గా సంక్రాంతికి రామ్‌చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ మ‌రో రెండు పెద్ద‌ చిత్రాల రిలీజ్ ఉండ‌డం అవి ఆ నిర్మాత‌కు సంబంధించిన‌వే కావ‌డంతో తంటేల్ అరిలీజ్‌పై అనుమానాలు స్టార్ట్ అయ్యాయి.

ఆపై ద‌ర్శ‌కుడు ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ జ‌న‌వ‌రిలో సినిమా విడుద‌ల‌కు రెడీగా ఉంద‌ని చెప్ప‌డంతో ఇష్యూ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలోనే అక్కినేని ఫ్యామిలీకి ఎంతో అచ్చోచ్చిన సంక్రాంతికి తండేల్ సినిమా రిలీజ్ ఉంటుందా ఉండ‌దా అనే సోష‌ల్ మీడియాలో తెగ చ‌ర్చ జ‌ర‌గ‌డంతో పాటు చిత్ర యూనిట్‌పై తెగ ట్రోలింగ్ జ‌రిగింది. కావాల‌ని తండేల్ సినిమాను వాయిదా వేస్తున్నారంటూ అదేప‌నిగా కామెంట్లు వ‌స్తుండ‌డంతో ఈ వ్య‌వ‌హారం ఎక్క‌డికో వెళుతుందని జాగ్ర‌త్త ప‌డ్డ మేక‌ర్స్ ఒక ప్రెస్‌మీట్ నిర్వహించి సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా అల్లు అర‌వింద్ మాట్లాడుతూ మేం సంక్రాంతికి అస‌లు సినిమా రిలీజ్ చేస్తామ‌ని ఏనాడు చెప్ప‌లే.. ఫ్యాన్స్, మీడియా అలా ప్ర‌చారం చేసిందని క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి మన సినిమా రావాలని అందరికీ ఉంటుంది. కానీ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి. మా సినిమాకు థియేటర్స్ షేర్ అవ్వకూడదని.. ఈ సినిమాకు సోలో రిలీజ్ కావాలని కోరుతున్నాం. ఫస్ట్ వీకెండ్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ వెరీ ఇంపార్టెంట్.. అందుకే మాకు ఎలాంటి అపోజిషన్ లేకుండా ఉండాలని.. అనేక లెక్కలు వేసుకుని ఈ డేట్ ఫిక్స్ చేశామ‌ని ఆ రోజు అల్లు అరవింద్ అన్నారు. ఫిబ్రవరి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాన్ ఇండియాగా సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Updated Date - Nov 05 , 2024 | 05:17 PM