Naga Chaitanya: ఆ పోస్ట్ కూడా తీసేసిన చైతూ.. సమంత చివరి జ్ఞాపకం

ABN, Publish Date - Oct 27 , 2024 | 09:56 PM

అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాగ చైతన్య.. తన ఇన్‌స్టా ఖాతా నుండి సామ్ చివరి జ్ఞాపకాలని డిలీట్ చేశాడు. అయితే గతంలోనే చైతన్య, సామ్ అన్ని పోస్టులు డిలీట్ చేశారు, ఇంకేం చివరి జ్ఞాపకం అనుకుంటున్నారా..

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) త్వరలో పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది. పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. పసుపు దంచుతున్న ఫొటోలను శోభితా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేశారు. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అని క్యాప్షన్‌ పెట్టారు. ఎరుపు రంగు పట్టు చీరలో శోభిత సంప్రదాయబద్దంగా మెరిసిపోతూ కనిపించారు.


సమంతతో విడాకుల అనంతరం చైతూ.. అన్ని మెమోరీస్‌ని చెరిపేశాడు. ఇరువురు కూడా తమ సోషల్ మీడియా అకౌంట్ల నుండి ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ డిలీట్ చేశారు. కానీ.. డైవర్స్‌కి సంబంధించిన పోస్ట్‌తో పాటు మజిలీ సినిమా పోస్టర్, సామ్‌తో కలిసి రేస్ ట్రాక్‌పై తీసిన ఫొటో అలానే ఉన్నాయి. సామ్‌తో కలిసి రేస్ ట్రాక్‌పై తీసిన ఫోటో పోస్టు‌కి ‘బ్యాక్ త్రో …మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్’ అని క్యాప్షన్‌ పెట్టాడు చైతన్య. అయితే తాజాగా ఆ ఫొటోస్‌ని చైతూ రిమూవ్ చేసినట్లు తెలుస్తుంది.


మరోవైపు శోభితా ధూళిపాళ్ల పసుపు దంచిన ఫొటోలు వైరల్‌గా మారాయి. పెళ్లి ఎక్కడ, ఎప్పుడో అనేది ఇంకా వెల్లడించలేదు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు అదే ప్రశ్న అడుగుతున్నారు. ఆగస్ట్‌ 8న నిశితార్థ వేడుక చేసి అందరికీ షాక్‌ ఇచ్చారు. తమ కుటుంబంలోకి శోభితని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్టు నాగార్జున ప్రకటించారు. శోభిత ఇంట్లో పెళ్లి పనులు మొదలైనట్లు తెలుస్తుంది కానీ.. అక్కినేని కుటుంబం నుంచి పెళ్లికి సంబంధించిన ఎలాంటి వార్తా బయటకు రాలేదు. ఈ నెలలోనే పెళ్లి జరగబోతోందని, పెళ్లి వేడుక నిరాడంబరంగా ఉంటుందని సమీప బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది

Updated Date - Oct 27 , 2024 | 09:56 PM