IndianRacingFestival: హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్‌ను సొంతం చేసుకున్న యువ సామ్రాట్
ABN, Publish Date - Aug 22 , 2024 | 08:55 PM
ఆటో మొబైల్స్ అంటే చాలా ఇష్టపడే అక్కినేని నాగచైతన్య కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్) లో పోటీ పడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు.
ఇటీవలే శోభితతో ఎంగేజ్మెంట్‌తో వార్తల్లోకెక్కిన అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) మరో హాట్ టాపిక్ అయ్యాడు. చైతుకి ఆటో మొబైల్స్ అంటే చాలా మక్కువ. చిన్నప్పటి నుంచి కారు రేసింగ్స్ అన్నా, ఫార్ములా వన్ అంటే చాలా ఇష్టం ప్రదర్శిస్తుంటాడు. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో తెలియజేశారు. అలాగే రేసింగ్ కార్లను, మోటార్ సైకిల్స్‌ను కూడా సేకరిస్తుంటారు.
అలాంటి ఇష్టమైన రంగంలోకి దిగి కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్) (Indian Racing League 2024)లో పోటీ పడే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ (Hyderabad Black Birds) ఫ్రాంచైజీని నాగ చైతన్య సొంతం చేసుకున్నారు. దీని వల్ల ఆయన ఐఆర్ఎఫ్ నిర్వహించే ఫార్ములా 4లో భాగమయ్యారు. దీనికి సంబంధించిన రేసులు ఆగస్ట్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్బంగా అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుంచి మోటార్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఫార్మాలా వన్‌ను ఎంతగానో ప్రేమిస్తాను. ఫార్ములా వన్‌లోని హైస్పీడ్ డ్రామా, వేగంగా కార్లు, బైక్స్ నడపటంలోని థ్రిల్ నన్నెంతగానో ఆకట్టుకుంటుంది. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ నాకు కాంపిటేషన్ కంటే ఎక్కువ అని నేను భావిస్తాన్నారు. నా ఫ్యాషన్‌ను చూపించుకునే చక్కటి వేదిక ఇదని నేను భావిస్తున్నానని, హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌ను సొంతం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఫ్యాన్స్‌కు ఐఆర్ఎఫ్ అనేది మరచిపోలేని అనుభూతినిస్తుందనటంలో సందేహం లేదని, అలాగే దీంతో ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ నెక్ట్స్ రేంజ్‌కి చేరుకుంటుందని, కొత్త టాలెంట్ బయటకు వస్తుంది’ అని అన్నారు.
ఇండియన్ రేసింగ్ లీగ్‌లో పాల్గొంటున్న ఆరు టీమ్స్‌లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ (Hyderabad Black Birds) ఒకటి. ఇందులో నాగచైతన్య (Naga Chaitanya) భాగం కావటం అనేది స్పీడ్ గేమ్‌కి మరింత ఆకర్షణగా మారింది. ఇంకా ఇందులో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ భాగమయ్యారు.