Naga Chaitanya: ఏదో చేయాలి... అది అలా ఉండాలి
ABN, Publish Date - May 28 , 2024 | 08:01 PM
‘తండేల్’ సినిమా తన కెరీర్‌కు ఎంతో ప్రత్యేకమని, ఆ పాత్ర కోసం తొమ్మిది నెలలుగా కష్టపడుతున్నా అని నాగచైతన్య అన్నారు. ఆయన కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది.
‘తండేల్’ (Thandel) సినిమా తన కెరీర్‌కు ఎంతో ప్రత్యేకమని, ఆ పాత్ర కోసం తొమ్మిది నెలలుగా కష్టపడుతున్నా అని నాగచైతన్య(Naga Chaitanya) అన్నారు. ఆయన కథానాయకుడిగా చందూ మొండేటి (Chandoo mondeti) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సాయి పల్లవి కథానాయిక. తాజా ఇంటర్వ్యూలో చైతన్య ఆసక్తికర విషయాలు తెలిపారు. ‘‘ఓటీటీకు ఆదరణ ఎక్కువగా ఉన్న ఈ కాలంలో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలంటే కొత్తగా ఏదైనా చేయాలి. ఆడియన్స మెస్మరైజ్ కావాలి. అది అద్భుతమైన విజువల్స్‌తోనే సాధ్యం. అయితే, అదొక్కటే సరిపోదు. ప్రస్తుతం మార్కెట్‌కు ఏది అవసరమో దాన్ని గుర్తించి ప్రేక్షకులకు అందించాలి. రాసుకున్న కథ, దాని పరిధి మేరకు సహజత్వం తీసుకురావడమన్నది ఎంతో అవసరం. మరీ ముఖ్యంగా కథలోని పాత్రలకు నటీనటు?ని చక్కగా సరిపోవాలి. ‘తండేల్’ కోసం నేను 9 నెలల పాటు సిద్థమయ్యా. ఇదొక స్ఫూర్తిమంతమైన కథ. శ్రీకాకుళం యాసతో సహా నా పాత్ర కోసం అవసరమైన ప్రతీ దానిని నేర్చుకున్నా. నా కెరీర్‌లోనే ఇదొక భారీ చిత్రమవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. 9Sai palalvi)
మత్స్యకార యువకుడిగా నాగచైతన్య ఇందులో నటిస్తున్నారు. యధార్థ సంఘటనల ఆధారంగా సాగే ప్రేమకథగా చందూ దీన్ని తెరకెక్కిస్తున్నారు. సముద్రం ఇతివృత్తంగా సాగే కథ కావడంతో విజువల్స్‌పరంగానూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అండర్ వాటర్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటాయని టీమ్ చెబుతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్ పూర్తయింది. చైతూ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.40 కోట్లకు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ మూవీ రైట్స్‌ను దక్కించుకుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘తండేల్’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ర్టీమింగ్ కానుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాస్ నిర్మిస్తున్నారు.