మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

SABARI: 'నా చెయ్యి పట్టుకోవే...' వరలక్ష్మీ 'శబరి' నుంచి పాట విడుదల

ABN, Publish Date - Apr 22 , 2024 | 02:14 PM

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి' నుంచి తాజాగా 'నా చెయ్యి పట్టుకోవే .. అంటూ సాగే పాటను విడుదల చేశారు.

sabari

వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శబరి (Sabari). తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించగా అనిల్ కాట్జ్ దర్శకత్వం వ‌హించారు. చిత్రం దిడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. తాజాగా 'నా చెయ్యి పట్టుకోవే .. (Naa Cheyye Pattukove) అంటూ సాగే పాటను విడుదల చేశారు.

అయితే.. 'శబరి'(Sabari)ని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న నేప‌థ్యంలో ఈ పాటను సైతం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం... ఐదు భాషల్లో విడుదల చేశారు. 'శబరి'కి గోపీసుందర్ (Gopi Sundar) సంగీతం అందించారు. ఆయన స్వరపరిచిన బాణీకి తెలుగులో రహమాన్ సాహిత్యం అందించారు. ఈ పాటను అమృతా సురేష్ పాడగా 'శబరి మ్యూజిక్' ఛానల్ ద్వారా సాంగ్ విడుదలైంది. సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కుమార్తెగా నటించిన నివేక్షపై కొడైకెనాల్ కొండల్లో అందమైన ప్రదేశాల్లో ఈ పాటను తెరకెక్కించారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ విహార యాత్రకు వెళ్లే సమయంలో పాట వస్తుందని విజువల్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. 


'నా చెయ్యి పట్టుకోవే...' సాంగ్ విడుదలైన సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ... ''ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందన్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉండ‌బోతోంద‌ని.. తల్లిగా ఆమె నటించిన తీరు, కుమార్తె కోసం పడే తపన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందన్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ తొలిసారి ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశారని. తల్లీ కుమార్తె మధ్య సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకుంటయ్యన్నారు. కథలో కీలకమైన సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. మే 3న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

Updated Date - Apr 22 , 2024 | 02:14 PM