Ravi Shankar: లేడీ కొరియోగ్రాఫర్.. అల్లు అర్జున్ అలా మాట్లాడరు
ABN, Publish Date - Sep 23 , 2024 | 01:09 PM
జానీ మాస్టర్ వివాదంపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ యలమంచిలి స్పందించారు. జానీ మాస్టర్, లేడీ కొరియోగ్రాఫర్‌లది పర్సనల్ గొడవ లాగా అనిపిస్తొందన్నారు.
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master) తన దగ్గర అసిస్టెంట్‌గా (Lady Choriographer) పని చేసిన యువతిని లైంగికంగా వేధించాడంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! బాధిత యువతీ జానీపై కేసు పెట్టడం ఆయన్ను తెలంగాణ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై మైత్రీ మూవీ మేకర్స్ (mythri movie makers) నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ (Ravi shankar yamanchili) యలమంచిలి స్పందించారు. జానీ మాస్టర్, లేడీ కొరియోగ్రాఫర్‌లది పర్సనల్ గొడవ లాగా అనిపిస్తొందన్నారు.
"ఆమె ఎప్పటినుంచో మా సినిమాలకు వర్క్ చేస్తోంది. పుష్ప 2’ మొదలైనప్పుడే అడిషనల్ కొరియోగ్రాఫర్‌గా ఆమెను తీసుకున్నాం. సినిమాలోని అన్ని పాటలకు ఆమె వర్క్ చేస్తారు. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. అక్టోబర్ 15 తర్వాత ఆ పాటల చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నాం. కొన్నాళ్ల క్రితం రిలీజ్ చేసిన లిరికల్ వీడియోలోనూ ఆమె పేరు ఉంది. సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. జానీ మాస్టర్‌తో వర్క్ చేయాలనుకున్నాం. ఇంతలో ఇది జరిగింది. ఆయన్ను పక్కనపెట్టి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలని బన్నీ ఎందుకు అనుకుంటారు. ఆయన స్ట్రెచర్ కి తగ్గట్టే ఆయన వ్యవహరిస్తారు. విషెస్ చెబితే స్పందించడం తప్ప హీరోకు ఏమీ తెలియదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ హడావుడి తప్ప బన్నీ గారి పేరుతో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని అన్నారు.
అయితే ఇప్పుడు రవిశంకర్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నారు. బన్నీ సదరు కొరియోగ్రాఫర్‌కి అండగా ఉంటానని మాటిచ్చారని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఆయన అభిమానులు సన్నిహితులు బన్ని గురించి ఎంతో గొప్పగా చెబుతుంటే.. ఇప్పుడు ఆయన నిర్మాత యలమంచిలి రవిశంకర్ బన్నీ ఆయన స్ట్రెచర్‌ను తగ్గించుకుని జానీని పక్కన పెట్టి ఆ అమ్మాయిని ఎలా ప్రమోట్ చేస్తారని అంటున్నారు. దీనిలో ఎవరి మాటలు నిజమో తెలియాల్సి ఉంది.
జానీ మాస్టర్, లేడీ కొరియోగ్రాఫర్ వివాదం తెరపైకి రాగానే అల్లు అర్జున్ ఆ అమ్మాయికి తన చిత్రాల్లో అవకాశం కల్పిస్తానని, స్వయంగా ఆయన మేనేజన్లే ఈ విషయాన్ని చెప్పారని ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్‌మీట్ అనంతరం యాంకర్ జాన్సీ (ఆఫ్ ద రికార్డ్) చెప్పారని వార్తలొచ్చాయి. దాంతో అందరూ బన్నీది చాలా గొప్ప మనసని పొగడ్తల వర్షం కురిపించారు. అలాగే విమర్శలు చేశారు. పుష్ప చిత్రంలో కేశవ పాత్రధారి జగదీస్ విషయంలో కూడా ఇలాగే స్పందించి ఉంటే బావుండేదని నెటిజన్లు బన్నీకి హితవు పలికారు. అదే రోజు త్రివిక్రమ్ గురించి నటి పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై కూడా బన్నీ స్పందించి పూనమ్‌కు (Poonam Kaur) అండగా నిలబడి ఉంటే బావుండేదని కామెంట్స్ చేస్తున్నారు.
నెగటివ్ కోణంలో చూడొద్దు...
అలాగే మైత్రీ సంస్థలో రాబోతున్న ఇతర చిత్రాల ఈవెంట్స్ గురించి ఆయన మాట్లాడారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దృష్టి లో పెట్టుకుని.. మా రాబోయే సినిమాల ఈవెంట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి చేస్తున్న సపోర్ట్ట్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాము. దేవరకు మంచి టికెట్ రేట్లు ఇచ్చారు. పుష్ప-2 విషయంలోనూ అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. పుష్ప 2 సినిమాకు బయట డ్రిస్టబెన్సెన్స్ ను ఆపాదించవద్దు. పుష్పకు తెలుగు సినిమా సత్తాను చూపగల కెపాసిటీ ఉంది. దయచేసి సినిమాను నెగిటివ్ కోణంలో చూడొద్దని మనవి చేస్తున్నాం’’ అన్నారు.