Mythri Movie Makers: వాంటెడ్‌గానే బన్నీ టార్గెట్.. వదిలేదే లే

ABN, Publish Date - Dec 07 , 2024 | 08:05 AM

అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాపై కొందరు పనిగట్టుకొని మరి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'పుష్ప 2' థియేటర్‌లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. అయితే మరోవైపు సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా రచ్చను మరింత పెద్దది చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగ్ లు ఉన్నాయంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. దీంతో నిర్మాణ సంస్థ మైత్రీ రంగంలోకి దిగింది.


ఈ ఇష్యూపై మైత్రీ మూవీ మేకర్స్ సీరియస్ అవుతూ.. "ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప 2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం మానుకోకపోతే అలాంటి వారిపై చట్ట పరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం" అంటూ ప్రకటించారు. ప్రధానంగా ఈ మూవీలో "ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్.. ఆడికీ, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్" అనే ఊహాజనితమైన డైలాగ్ ను బాగా వైరల్ చేశారు. దీంతో మరోసారి తెరపైకి మెగా వర్సెస్ అల్లు అనే టాపిక్ వచ్చింది.


మరోవైపు ఈ సినిమా సోషల్ మీడియాలో, పైరసీ సైట్ లలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. దీనిపై కూడా మైత్రీ స్పందిస్తూ.. ఎవరికైనా అలాంటి లింక్ లు కనిపిస్తే వెంటనే యాంటీ పైరసీ ఫోరమ్ కి రిపోర్ట్ చేయాలని కోరుతూ రిపోర్ట్ చేయాల్సిన లింక్ ని షేర్ చేశారు. ఆ వీడియోలను వెంటనే తొలిగించడంతో పాటు బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

Updated Date - Dec 07 , 2024 | 08:11 AM